సీన్ రివర్స్...ఆనందయ్య నీ మందు వద్దయ్య

(జానో జాగో వెబ్  న్యూస్-ఏపీ ప్రతినిధి)

కరోనా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కరోనా మందు ఆనందయ్యకు చెదు అనుభవం ఎదురైంది.  ఒకపుడు ఆనందయ్యకు ఎనలేని క్రేజ్ ఉండేది. కానీ ఇపుడు సీన్ రివర్స్ అవుతోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు స్థానికుల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ఇంటి ముందు జనాలు ధర్నాకు దిగారు.. మందు పంపిణీ చేయొద్దని ఆందోళన చేపట్టారు. మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నంచి వేలమంది ఇక్కడికి రావడం వల్ల తమకు కరోనా సొకుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఒమిక్రాన్‌కు మందు కనిపెట్టినట్లు అసత్యం ప్రచారం చేస్తున్నారని ఆనందయ్యపై మండిపడ్డారు. ఆనందయ్య ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ కొందరు నిలదీశారు. అయితే ఆనందయ్య వాదన మరోలా ఉంది.. మందు పంపిణీకి అనుమతి ఉందని. మందు కోసం చాలామంది వస్తున్నారని. కావాలనే కొందరు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. స్థానికులు ధర్నా చేస్తున్న విషయం తెలియడంతో పాటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆనందయ్యతో చర్చించారు.. పర్మిషన్ లెటర్ చూపించాలని కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      


   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: