ఓటిఎస్ కు వ్యతిరేకంగా...
టీడీపీ నిరసన
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)
ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఓటిఎస్ కు వ్యతిరేకంగా ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండల కేంద్రంలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు తొలుత తర్లుపాడు పట్టణంలో ర్యాలీ ని నిర్వహించి తదనంతరం మండల అభివృద్ధి అధికారి(ఎంపీడీఓ )ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మార్కాపురం మాజీ శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓటిఎస్ పథకం స్వచ్ఛందం అంటూ ఎప్పుడో 30 సంవత్సరాల నుండి 2012 వరకు నిర్మితమైన ఇళ్లకు ఇళ్ల పట్టాలు అంటూ ప్రతి ఒక్కరు పదివేల రూపాయలు చెల్లించాలని
రాష్ట్ర వ్యాప్తంగా 5450 కోట్ల రూపాయల వసూలు చేయాలని ప్రభుత్వ అధికారులకు, వెలుగు సిబ్బంది కి, వివో లకు టార్గెట్లు విధించి పేదల నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు అని తక్షణమే బుద్ధి తెచ్చుకొని బలవంతపు వసూళ్లు మానాలని డిమాండ్ చేశారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని ఇండ్ల పట్టాకు ఎవరు ఒక రూపాయి చెల్లించవలసిన అవసరం లేదని బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచితంగా పేదలకు ఇళ్ల పట్టాలు జారీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షులు
ఊడుముల చిన్నప్ప రెడ్డి, మార్కాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి, పొదిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ మైనారిటీసెల్ అధ్యక్షులు షేక్ రసూల్, టీఎన్ఎస్ఎఫ్ ఒంగోలు పార్లమెంటరీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాష, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పుచ్చనూతల గోపీనాథ్ , కాలoగి శ్రీనివాసులు, సాధo వీరయ్య, మార్కాపురం మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ సయ్యద్ గఫార్, చలువాది వెంకటేశ్వర్లు, తెలుగుదేశం నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్ వలీ తర్లుపాడు మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: