జస్టిస్ డాక్టర్. కుంభజడల మన్మథ రావుకు..
ప్రముఖుల అభినందనలు
కుటుంబంతో సహా కలిసిన బీజేపీ మైనార్టీ మోర్చ నేత
(జానో జాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులై బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారిగా తన సొంత గ్రామమైన ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం బింగినపల్లి కి వచ్చిన జస్టిస్ డాక్టర్. కుంభజడల మన్మథ రావును పలువురు ప్రముఖులు కలిశారు. ఇందులో భాగంగా మర్యాదపూర్వకంగా బీజేపీ మైనారిటీ మోర్చా ఫార్మేర్ రాష్ట్ర అధ్యక్షుడు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ ఛైర్మన్ షేక్. ఖలీఫాతుల్లాబాషా, ఆయన కుమార్తె న్యాయవాది షేక్. కరిష్మా, కుమారుడు ఆదిల్, ఇన్నోవేషన్ క్లబ్ డైరెక్టర్ షేక్. అహీత్ లతో వచ్చి న్యాయమూర్తిని కలిశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్. కుంభజడల మన్మధరావును వారు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్. కుంభజడల మన్మధరావు యువ న్యాయవాది షేక్. కరిష్మానీ అభినందిస్తూ న్యాయవాద త్తి లో నైతికతకు చోటు కల్పించి నడుచుకోవాలని సూచించారు.
Home
Unlabelled
జస్టిస్ డాక్టర్. కుంభజడల మన్మథ రావుకు.. ప్రముఖుల అభినందనలు,,, కుటుంబంతో సహా కలిసిన బీజేపీ మైనార్టీ మోర్చ నేత
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: