జనవాసులున్న ఇంటివద్దే కన్నం

అర్ధరాత్రి దొంగలు హల్ చల్

రెండు పొట్టేలు మాయం

పోలీసుల గస్తీ పెరగాలని కోరుతున్న గడివేముల ప్రజలు

కన్నీరుమున్నీరవుతున్న బాధితురాలు రవణమ్మ

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలంలో  ఆదివారం అర్ధరాత్రి దొంగలు హాల్చల్ చేశారు. దర్జాగా రెండు పొట్టేళ్లను దొంగిలించుకుని తీసుకొని వెళ్ళిపోయారు. వివరాల్లోకి వెళితే..... గడివేముల గ్రామంలోని బీసీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేసి రమణమ్మ ఇంటివద్ద కట్టేసిన రెండు పొట్టేళ్లను దొంగతనంగా ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ గాఢ నిద్రలో ఉండగా దొంగలు గుట్టుచప్పుడు కాకుండా రమణమ్మ ఇంటి వద్ద కట్టేసి ఉంచిన రెండు పొట్టేళ్లను  దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోయారు. దొంగిలించబడిన రెండు పొట్టేళ్ల విలువ సుమారు 40 వేలు ఉంటుందని బాధితురాలు రవణమ్మ కన్నీరుమున్నీరవుతోంది.


కేవలం నిర్మానుష్య ప్రాంతాలను, జన సంచారం తక్కువగా ఉండే ప్రాంతాలను, ప్రదేశాలను గుర్తించి ఇంటిలోని డబ్బులను, విలువైన వస్తువులను, దొంగతనాలు చేసే దొంగలు, నేడు గ్రామాలలో జనసంచారం ఉండే ప్రదేశాలను టార్గెట్ చేసి మూగజీవాలను దొంగతనం చేయడంతో గడివేముల గ్రామం లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాలలో రాత్రి పూట గస్తీ నిర్వహించే పోలీసులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా నా పోలీసు అధికారులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేసి, పర్యవేక్షించి దొంగల బారి నుండి కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లింమా...ఆయన  ముస్లిం అయితే ఆయన భౌతికాయానికి పార్శీ మత ఆచారాల  ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేశారు... ఇది తెలుసుకోవాలని ఉందా...అయతే మీ jaanojaagotv నీ Subscribe చేసుకోండి 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaagotv నీ Subscribe చేసుకోండి

              

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: