స్నేహమంటే ఇదేరా
కష్టాల్లో ఆదుకునే ఆపన్న హస్తం...
స్నేహబంధం ఒకటే
(జానో జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)
కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలం, జన్మనిచ్చిన తల్లిదండ్రులు,బంధువులు, కష్టాల్లో ఉన్నప్పుడు తమ సొంత వారిని సైతం వదిలివేసే ఈ కాలంలో చిన్నప్పటి నుండి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నమ్, అనే ఒకే ఒక స్నేహబంధం తో ముందుకు వచ్చిన 2000 సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థులు. వివరాల్లోకి వెళితే.... గడివేముల మండలం బూజు నూరు గ్రామానికి చెందిన కరీముల్లా నవంబర్ 22 వ తేదీన అనారోగ్యంతో మరణించడంతో అతని భార్య, కుమారుడు,కుమార్తె, ఇంటి పెద్దను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న 2000 సంవత్సరం పూర్వ విద్యార్థులు తన చిన్ననాటి స్నేహితుడు చనిపోయాడనే వార్త తెలుసుకుని మిత్రుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో తోటి విద్యార్థులు అందరూ కలిసి బూజునూరు గ్రామానికి వెళ్లి కరీముల్లా కుటుంబ సభ్యులకు 1 లక్ష 35 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా కరీముల్లా కూతురు వివాహానికి అయ్యే ఖర్చు మొత్తం కరీముల్లా మిత్రులలో ఒకరైన రామ్మోహన్ భరిస్తానని చెప్పడం తో స్నేహితుల పై స్నేహితులకు ఉండే నమ్మకం విశ్వాసం అనేవి వెలకట్టలేని వని నిరూపించారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, ఇబ్రహీం, మనోహర్, సుధాకర్, అలీ భాష, తో పాటు దాదాపు 30 మంది 2000 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు. స్నేహితుడు
కరిముల్లా ఈలోకంలో లేకున్నా అతనితో పాటు చదువుకున్నమ్,ఆడుకున్నామని,స్నేహితులు అందరూ వచ్చి మా బాధలను వారి బాధలు గా పంచుకోవడంతో స్నేహానికి ఉండే విలువ ఎంతో గొప్పదని అని, ఆర్థిక సహాయం అందించిన 2000 సంవత్సరం బ్యాచ్ కరీముల్లా స్నేహితుల అందరికీ పేరుపేరునా కరీముల్లా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Home
Unlabelled
స్నేహమంటే ఇదేరా,, కష్టాల్లో ఆదుకునే ఆపన్న హస్తం... స్నేహబంధం ఒకటే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: