ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారు?

ఎంపీ ఆదాల

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

 న్యాయ సేవ విభాగంలో ఏర్పడిన ఖాళీలు ఎన్ని?, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం పార్లమెంటులో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన    (యు.పి.ఎస్.సి) (ఎస్.ఎస్.సి) లను ఇందుకు వినియోగించుకో నున్నారా అని కూడా ప్రశ్నించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు దీనికి రాతపూర్వకంగా సమాధానమిస్తూ కేంద్ర న్యాయ సేవా విభాగంలో 157 గాను 65 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇందులో ప్రమోషన్ కోటాను యూపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మిగతా ఖాళీలను ఎస్.ఎస్.సి ద్వారా భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: