"హిందూ-ముస్లిం ఐక్యత పుస్తకావిష్కరణ" లక్ష్యం,,,
ప్రజల మధ్య సఖ్యత,సామరస్యం, సోదర భావం పటిష్టత
జమాఅతె ఇస్లామి హింద్
(జానో జాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)"హిందూ-ముస్లిం ఐక్యత పుస్తకావిష్కరణ" లక్ష్యం ప్రజల మధ్య సఖ్యత,సామరస్యం, సోదర భావం పటిష్టత అని జమాఅతె ఇస్లామి హింద్ మార్కాపురం శాఖ పేర్కొంది. ఆదివారంనాడు మార్కాపురం పట్టణంలోని స్ధానిక ప్రెస్ క్లబ్ లో జమాఅతె ఇస్లామి హింద్ మార్కాపురం ఆధ్వర్యంలో ప్రధమ స్వాతంత్ర సంగ్రామంలో హిందూ- ముస్లిం ఐక్యత పుస్తక ఆవిష్కరణ సభను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన పట్టణ ప్రముఖులు సీనియర్ పాత్రికేయులు ఓరుగంటి మల్లిక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 1927 డిసెంబర్ 19 న ఒకేరోజున భారత స్వాతత్య్రో సమరయోధులు, అమరవీరులు పండిత రాంప్రసాద్ బిస్మిల్ - అశ్ఫాఖుల్లా ఖాన్ లను ఒకేరోజు ఉరితీసిన డిసెంబర్ 19 రోజున 94వ సంస్మరణను
సీనియర్ పాత్రికేయులు, సామాజిక సంఘ సంస్కర్త ఓరుగంటి మల్లిక్" హిందూ - ముస్లిం ఐక్యతా దినోత్సవం "గా జరపడం దేశానికే ఒక మంచి సందేశమని,దేశంలో ప్రతి పౌరుడు ఆనాటి స్వాతంత్ర సమర యోధుల స్పూర్తిని పెంపొందిచుకుంటూ కులమతాలకు అతీతంగా మతసామరస్యతను,మానతా ధృక్పధాన్నిపెంపొందించుకుంటూసమాజంలోని అన్ని మతాలను గౌరవించాలనీ,సామాజిక న్యాయం, దేశ సమైక్యత కోసం అందరూ కృషిచేయాలని,దేశం సమైక్యంగా ఉన్నపుడు మాత్రమే దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు అష్రప్ అలీ మాట్లాడుతూ ప్రజల మధ్య సఖ్యత, సామరస్యం, సోదర భావం మరింతగా పటిష్ట పర్చాలన్న లక్ష్యంతో పిడుగురాళ్ల నివాసి, ప్రముఖ చరిత్రకారులు, బహగ్రంధ రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ గత 22 ఎండ్లుగా అన్వేషణ - పరిశోధన - రచన - ప్రచురణ - ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన కృషి మనందరికీ ఆదర్శ ప్రాయమని కొనియాడారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం ఎస్టి జిల్లా అధ్యక్షులు బాబూ రావు,మజ్లిసుల్ ఉలమా పట్టణ అధ్యక్షులు హాఫిజ్ సాదిక్,జమాఅతె ఇస్లామి హింద్ పట్టణ అధ్యక్షులు మాలిక్ బాష,పట్టణ ఉపాద్యక్షులు సికిందర్,కార్యదర్శులు,మొహమ్మద్ ఖాన్,అజీజ్,ఐ.వై.యమ్ జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్,ఎస్.ఐ.ఓ పట్టణ అధ్యక్షులు ఖాలిద్, జమాఅతె ఇస్లామి హింద్ కార్యకర్తలు సలీం, షబ్బీర్,కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: