కొత్త ఎడాది,,,వస్తువుల ధరలు కొండెక్కుతాయా 


(జానో జాగో వెబ్  న్యూస్-బిజినెస్ బ్యూరో)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  వార్షిక  బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టే  పన్నులు వాస్తవానికి వివిధ వస్తువల  ధరలు  పెరిగేందుకు కారణమవుతుంది. కానీ  ఇందుకు భిన్నంగా కొత్తగా  రానున్న ఏడాదితో  వివిధ రకాల వస్తువులపై  ధరలు  పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే నూతన సంవత్సరంలో పలు వస్తువుల ధరలు పెరగొచ్చనే అంచనాలున్నాయి. కొన్ని పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, కన్సూమర్ గూడ్స్ కంపెనీలు వచ్చే కొన్ని నెలలల్లో వస్తువుల ధరలను పెంచొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం, లాజిస్టిక్స్ ఖర్చులు పైకి చేరడం, సరఫరా అడ్డంకులు వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

హిందుస్తాన్ యూనిలివర్, డాబర్, బ్రిటానియా, మారికో వంటి పలు కంపెనీలు ప్రొడక్టుల ధరలను గత రెండు త్రైమాసికాల్లో 5-12 శాతం మేర పెంచేశాయి. ఇప్పుడు మళ్లీ కొత్త ఏడాదిలో ధరలు పెంచేందుకు సిద్ధం అవుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో ఎడిబుల్ ఆయిల్ ధర మరింత 

పెరిగే అవకాశం ఉంది. ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలు వస్తువుల ధరలను వచ్చే మూడు నెలల కాలంలో 4-10 శాతం వరకు పెంచొచ్చని తెలుస్తోంది. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇప్పటికే 3-5 శాతం మేర ధరలు పెంచాయి. ఇవి ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ ధరలను మళ్లీ 6-10 శాతం వరకు పెంచేందుకు రెడీగా ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. 2020 నుంచి చూస్తే కంపెనీలు ప్రొడక్టుల ధరలను పెంచడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. అలాగే పలు వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే వాహన ధరలను పలు మార్లు పెంచేశాయి. అయితే మళ్లీ ఇవి కొత్త ఏడాదిలో ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. హీరో మోటొకార్ప్ ఇటీవలనే ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. టూవీలర్ ధరల పెంపు జనవరి 4 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ఇంకా పలు వాహన కంపెనీలు ధరలు పెంచబోతున్నాయి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      


   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: