ఐటీడీపీ కార్యకర్త మురళీపై దాడి చేయడం దుర్మార్గం.

అతని ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు పరాకాష్టకు చేరాయి. కుప్పం మండలం ములకలపల్లికి చెందిన ఐటీడీపీ కార్యకర్త మురళీపై వైసీపీ నేతలు దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ గూండాగిరి ఖండిస్తున్నా. కిడ్నాప్ చేసి కొట్టడమేకాకుండా ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారు. నిందితులను తక్షణమే పోలీసులు అరెస్టు చేయాలి. మురళీకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. మురళీకి, వారి కుటుంబానికి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుంది. రెస్కో చైర్మన్ సెంథిల్, అతని అనుచరులు ప్రశాంతమైన కుప్పంలో జగన్ రెడ్డి అండ చూసుకుని అరాచకం సృష్టిస్తున్నారు. ప్రశ్నించే వాళ్లు వైసీపీ నేతలకు కనబడకూడదా? రాష్ట్రం మీ జాగీరా..? మీ ఉడత ఊపులకు పసుపు సైనికులు బెదిరిపోరు. మీ దుర్మార్గం, అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వ తప్పులను ప్రశ్నించి, నిరసన తెలిపే హక్కు ఉంది. ప్రశ్నించి, విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించి రాజ్యాoగం ప్రసాదించిన స్వేచ్ఛా హక్కును కాలరాస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ గూండాలు తప్ప మరెవరూ ఉండకూడదని అనుకుంటున్నారు. వడ్డీతో సహా మీ అన్యాయాలను, అరాచకాలను తిరిగిచ్చేస్తాం. అని ఆయన హెచ్చరించారు.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: