కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ రాక

(జానో జాగో వెబ్ న్యూస్-కర్నూలు ప్రతినిధి)

కర్నూలు రూరల్ మండలం పంచలింగాల మాంటిస్సోరి స్కూల్ ఫంక్షన్ హాల్ లో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు  మధ్యాహ్నం 12:08 గంటలకు కర్నూలు జిల్లా పంచలింగాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేశారరు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ, రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, శాసనమండలి సభ్యులు చల్లా భగీరథ రెడ్డి, కత్తి నరసింహారెడ్డి, వెన్నపూస గోపాల్ రెడ్డి,


ఇసాక్ భాషా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి,  జాయింట్ కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ,


జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపు రెడ్డి మౌర్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సతీమణి నాగిని, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, సీటీ ప్రెసిడెంట్ రాజా విష్ణువర్ధన్ రెడ్డి, ఏపి మార్క్ పేడ్ చైర్ పర్సన్ పి.పెద్ద నాగిరెడ్డి,ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద  స్థానిక నాయకులను పలకరించి వారి నుండి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం  అక్కడి నుంచి రోడ్డు మార్గాన వివాహ వేదిక వద్దకు చేరుకొని పాణ్యం ఎమ్మెల్యే మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి  కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపి పుష్ప గుఛ్చాలు అందించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: