పరిశ్రమలు రాష్ట్రాన్నీ వీడిపోతున్నాయి
నారా లోకేష్ విమర్శ
(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
సబ్జెక్ట్ లేని సీఎం మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోంది. 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్‌ఎస్‌బిసి మూతపడటం బాధాకరం.
రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్ గా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్‌ఎస్‌బిసి కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకి నిదర్శనం. మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు. విశాఖని దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలి.అని నారా లోకేష్ సూచించారు.
Home
Unlabelled
పరిశ్రమలు రాష్ట్రాన్నీ వీడిపోతున్నాయి-- నారా లోకేష్ విమర్శ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: