సుప్రీం కోర్టు సిజెకు గవర్నర్ తేనేటి విందు

హాజరైన సీఎం, హైకోర్టు సీ.జే. ఇతర న్యాయమూర్తులు

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ గౌరవార్ధం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ లో తేనీటి విందు ఇచ్చారు. మూడు రోజులుగా రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి  గవర్నర్ ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం రాజ్ భవన్ కు విచ్చేసారు. ఎన్ వి రమణ , శివమాల దంపతులకు రాజ్ భవన్ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా ఘనంగా స్వాగతం పలకగా, సిజె పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అప్పటికే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , సతీమణి భారతి రాజ్ భవన్ కు చేరుకోగా, ముఖ్యమంత్రి సిజెకు ఎదురేగి రాజ్ భవన్ దర్బార్ హాలులోకి తోడ్కొని వచ్చారు. తొలుత రాజ్ భవన్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా రాగా,


సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వినీత్ శరణ్, జెకె మహేశ్వరి దంపతులు సుప్రీం సిజె తో కలిసి వచ్చారు. దర్బారు హాలులో గౌరవ గవర్నర్ తో భేటీ అయిన సుప్రీం సిజె సమకాలీన అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో శాసనపరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, అదనపు కార్యదర్శులు ధనుంజయ రెడ్డి, ముత్యాల రాజు, జిల్లా కలెక్టర్ నివాస్, సిపి కాంతి రాణా టాటా, ఐఎఎస్ అధికారులు కృతికా శుక్లా, షన్ మోహన్, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి, రాజ్ భవన్ ఉపకార్యదర్శి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. చివరగా గవర్నర్ , సిఎం, న్యాయమూర్తులతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గ్రూపు ఫోటో దిగారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: