గడివేముల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో .....
వినతిపత్రం అందజేత
(జానో -జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలం లోని టిడిపి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో, ఎమ్మార్వో, గారికి వినతి పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే.,...... పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు గారు 1983లో తొలిసారిగా పక్క గృహనిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ గృహ నిర్మాణ పథకానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు, వచ్చినా, మారిన, పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందజేశారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వైయస్సార్ సిపి ప్రభుత్వం మాత్రం వన్టైమ్ సెటిల్మెంట్ అని పేద ప్రజల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు,పట్టణాల్లో 40 వేల రూపాయల వరకు చెల్లించాలని ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసమని,
1983 నుండి 2011 వరకు కట్టించిన ఇళ్లకు ఒకవైపు ప్రభుత్వం స్వచ్ఛంద మనీ చెబుతుండగా వాలంటీర్లు,వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది, నాట్ విల్లింగ్ ఆప్షన్ తొలగించి లబ్ధిదారుల మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తున్నారని, లబ్ధిదారులు ఓ టి ఎస్ పథకాన్ని అంగీకరించకపోతే పెన్షన్ తొలగిస్తామని, రేషన్ కార్డులు తీసి వేస్తామని, ప్రభుత్వం నుండి వచ్చే వివిధ పథకాలు రాకుండా చేస్తామని వాలంటీర్లతో బెదిరించి మరి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఏ పీ ఎం లు సంఘమిత్రలు, Draqva సంఘాల్లో సభ్యులుగా
ఉన్న మహిళలకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించి ఓ టి ఎస్ సొమ్మును వసూలు చేస్తున్నారని, వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం చెప్పిన విధంగానే స్వచ్ఛందంగా లబ్ధిదారులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా గురిచేయకుండా ఉచితంగానే పేదల ఇళ్ల కు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని గడివేముల మండల నాయకులు,
గడివేముల ఎంపీడీవో విజయసింహారెడ్డి,ఎమ్మార్వో నాగమణి, ఇ ఆర్ డి ఓ ఖాలిక్ భాషా, గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గడివేముల టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి, సీనియర్ టిడిపి నాయకులు సీతారామి రెడ్డి, బొల్లవరం సుభద్రమ్మ, ఎస్సి సెల్ అధ్యక్షులు నాగ శేషులు, దుర్వేసి కృష్ణ యాదవ్ (కిట్టు),అవ్వారు శ్రీకాంత్, మండల టిడిపి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Home
Unlabelled
గడివేముల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ..... వినతిపత్రం అందజేత
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: