గడివేముల  మండలంలో...

 ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి

తహశీల్దార్ నాగమణికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం నేతల వినతి

(జానో -జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా గడివేముల  మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనీ స్పందన కార్యక్రమంలో గడివేముల  తహశీల్దార్ నాగమణికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక గడివేములలో  బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి.రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్.రియాజ్* మాట్లాడుతూ  గడివేముల అనుకొని అనేక చుట్టుపక్కల గ్రామాలలో విద్యార్థులు అనేకమంది విద్యార్థులు  సుదూర ప్రాంతాలకు వెళ్ళి డిగ్రీ లాంటి ఉన్నత చదువులు చదువుకోలేక మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని.ఇన్ని సంవత్సరలు గడుస్తున్నా కూడా గడివేముల మండలంలో కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని,


ఉన్నతాధికారులు,రాజకీయ నాయకులు చొరవ తీసుకుని గడివేముల మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేసి,విద్యార్థులకు ఉన్నత విద్య కు దూరం కాకుండా చూడాలని కోరుతూ గడివేముల తాహసిల్దార్ నాగమణికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. లేనిపక్షంలో గడివేముల మండలంలో ఉన్న విద్యార్థులందరినీ కలుపుకొని నిరంతరం ఉద్యమాలకు సిద్ధం అవుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య బనగానపల్లె నియోజకవర్గ అధ్యక్షులు రామకృష్ణ,వేణు తదితరులు పాల్గొన్నారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: