చెడ్డి గ్యాంగ్ కదలికల వదంతులు నమ్మవద్దు...

ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్

(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

జిల్లా పోలీస్ యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంది, ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ చేసి ప్రజలను భయభ్రాంతులను గురి చేయవద్దు అంటూ జిల్లా ఎస్పీ  మల్లికా గార్గ్ సూచించారు. ప్రకాశం జిల్లా కందుకూరు పరిధిలో నాలుగు రోజుల క్రితం చెడ్డి గ్యాంగ్ నివాసగృహాల పై దాడి చేసి ఇళ్లలో వారిని హత మార్చి దొంగతనం చేసినట్లుగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవడం గమనించడం జరిగింది. ఇటీవల కాలంలో విజయవాడ నగర పరిధిలో ఒకటి, రెండు చోట్ల చెడ్డి గ్యాంగ్ కదలికలను గమనించి పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమైన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా ముందుజాగ్రత్తగా నేరాలు నివారించడానికి పోలీస్ శాఖ తగిన చర్యలు చేపట్టి నిఘా పెంచి రాత్రి గస్తీ ముమ్మరం చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది.


అంతేగాని ప్రకాశం జిల్లాలో  చెడ్డి గ్యాంగ్ కదలికలు ఏ రకంగానూ లేవు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు లోను కావలసిన అవసరం లేదు. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు జిల్లా పోలీసు శాఖ తీసుకోవడం జరిగింది. అలాగే ఫేక్ న్యూస్ సర్కులేట్ చేసి ప్రజలను భయబ్రాంతులకు, అభద్రతకు గురి చేయవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ సూచించారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

          


        

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: