భారత్‌లోకి...థర్డ్ వేయ్
ఫిబ్రవరి తొలివారంలో గరిష్ఠానికి
ఐఐటీ కాన్పుర్ తాజా అధ్యయనం
(జానో జాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)
కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌తో చాలా దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి మరోసారి పెరుగుతోంది. కొన్ని చోట్ల మూడు, మరికొన్ని దేశాల్లో నాలుగో వేవ్ రూపంలో ప్రభావాన్ని చూపుతోంది. ఇదే సమయంలో భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మనదేశంలో ఫిబ్రవరి తొలివారానికి మూడో వేవ్ (Third Wave) గరిష్ఠానికి చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌తో పెరుగుతోన్న తీవ్రతను పరిగణనలోకి తీసుకొని భారత్‌లో ఈ అంచనాలను రూపొందించినట్లు తెలిపింది.దేశంలో థర్డ్‌వేవ్‌ను అంచనా వేసేందుకు గసియన్ మిశ్రమ మోడల్ అనే గణాంక పద్ధతి ద్వారా ఐఐటీ కాన్పూర్ నిపుణులు ఓ అంచనా వేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే థర్డ్‌వేవ్ ప్రభావాన్ని చవిచూస్తోన్న అమెరికా, బ్రిటన్, జర్మనీతోపాటు రష్యా దేశాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొన్నారు. వీటితోపాటు భారత్‌లో తొలి, రెండోవేవ్ సమయంలో నమోదైన కేసుల సంఖ్యనూ వినియోగించారు. వీటిని క్రోడీకరించిన నిపుణులు.. 2022 ఫిబ్రవరి తొలివారం నాటికి దేశంలో థర్డ్‌వేవ్ గరిష్ఠానికి చేరుకోవచ్చని అంచనా వేశారు. అయితే, వ్యాక్సినేషన్‌ను పరిగణనలోకి తీసుకోనందున ఆ సమయం నాటికి ఎన్ని కేసులు వస్తాయనే విషయాన్ని మాత్రం అంచనా వేయలేదని స్పష్టం చేశారు.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?
ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Home
Unlabelled
భారత్‌లోకి...థర్డ్ వేయ్ ,,,,ఫిబ్రవరి తొలివారంలో గరిష్ఠానికి -- ఐఐటీ కాన్పుర్ తాజా అధ్యయనం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: