స్టాప్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించండి
సిఎస్ డా.సమీర్ శర్మ
(జానో -జాగో వెబ్ న్యూస్_ఏపీ ప్రతినిధి)
వివిధ శాఖల వారీగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి వీలున్నంత వరకూ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కార్యదర్శులను ఆదేశించారు.అలాగే జిల్లా కలెక్టర్ల స్థాయిలో కూడా జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశాలను ఆస్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చూడాలని చెప్పారు.బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల
సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో ప్రధానంగా గత కార్యదర్శుల సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై తీసుకున్నచర్యల నివేదిక(ఎటిఆర్)ను సమీక్షించారు.అదే విధంగా వివిధ పెండింగ్ కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు,జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో వచ్చిన వివిధ ఆర్థిక,ఆర్థికేతర అంశాలను ఆయా శాఖల వారీగా తీసుకోవాల్సిన,పరిష్కారించాల్సిన అంశాలపై సిఎస్ సమీక్షించారు.వివిధ శాఖల్లో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి వచ్చే ఏడాది నుండి డిపిసి(డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ)కేలండర్లను రూపొందించి సకాలంలో డిపిసిలు నిర్వహించి పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.కోర్టు కేసులకు సంబంధించి ఎపి ఆన్లైన్ లీగల్ కేసు మేనేజిమెంట్ సిస్టమ్ (ఎపిఓఎల్సిఎంఎస్)గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ వివిధ కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు.కోర్టు కోసులకు సంబంధించి జిపిలు ఇతర న్యాయాధికారులతో సమన్వయంతో పనిచేసేందుకు వీలుగా ప్రతిశాఖలో సంయుక్త కార్యదర్శి లేదా డిప్యూటీ కార్యదర్శి స్థాయిలో న్యాయ పరిజ్ణానం కలిగిన అధికారిని నోడలు అధికారిగా నియమించాలని సిఎస్ ఆదేశించారు.కోవిడ్ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు వీలుగా అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలతో సన్నద్ధమై ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులను సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.అంతకు ముందు కోర్టు కేసులకు సంబంధించి రూపొందించిన ఎపి ఆన్లైన్ లీగల్ కేసు మేనేజిమెంట్ సిస్టమ్(ఎపిఓఎల్సిఎంఎస్) గురించి బాబు ఎ వివరించారు.
సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి(సర్వీస్ వెల్పేర్)శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ 12ఏళ్ళ తర్వాత ఎపి జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబరులో నిర్వహించడం జరిగిందని తెలిపారు.18అధికారులు,మరో 16 వివిధ సంఘాల ప్రతినిధులు కలిపి 33మందితో కూడిన అత్యున్నత బాడి ఈకౌన్సిల్ అని దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షులని అన్నారు.జెఎస్సి సమావేశంలో వచ్చిన ఆయా అంశాలు, డిమాండులను సంబంధిత శాఖలకు పంపామని తెలిపారు.తొలుత సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ స్వాగతం పలుకగా పలు శాఖల కార్యదర్శులు వారివారి శాఖలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అనంతరాము, సాయి ప్రసాద్, అజయ్ జైన్, కరికల వల్లవన్, డా.కెఎస్.జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య, బి.రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులు, ఎస్ ఎస్ రావత్, కృష్ణ బాబు, గోపాలకృష్ణ ద్వివేది, అనిల్ కుమార్ సింఘాల్, ముఖేష్ కుమార్ మీనా, కుమార్ విశ్వజిత్, వాణి మోహన్, శ్యామలరావులతో పాటు పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు.
Home
Unlabelled
స్టాప్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించండి-- సిఎస్ డా.సమీర్ శర్మ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: