జర్నలిస్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

షేక్.ఖలీఫాతుల్లా బాషా డిమాండ్

(జానో -జాగో వెబ్ న్యూస్_ఒంగోలు ప్రతినిధి)

సమస్యలతో సతమతమవుతున్న జర్నలిస్టులను ఆదుకునే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు తీసుకురావాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా చైర్మైన్ షేక్.ఖలీఫాతుల్లా బాషా డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలో సోమవారం నాడు జరిగిన ఆంద్రప్రదేశ్ వార్కిగ్ జర్నలిస్టుల సమైక్య ఏపీ డబ్ల్యూజెఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంనకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా చైర్మైన్ షేక్.ఖలీఫాతుల్లా బాషా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జర్నలిస్టుల పరిస్థితి చాలా  కష్టదాయకమైందని అనేక సమస్యలతో సతమతమౌతున్న పరిస్థితి లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.ప్రపంచం మొత్తం కరోన తో  విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందేననీ కరోనాని ఎదుర్కొని నిస్వార్థంగా బాధ్యతలు నిర్వహించుతూ ఏరోజు వార్తలు ఆరోజే  పూర్తి సమాచారంతో అప్పటికప్పుడు వార్తలు  అందివ్వగలిగే జర్నలిస్టుల సమైక్య కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఏపీ డబ్ల్యూజెఎస్ జాతీయ అధ్యక్షుడు చర్లగుడ్ల రామకృష్ణ ,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల సురేష్, జిల్లా అధ్యక్షుడు కోయి శ్రీ హరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా చైర్మైన్ షేక్. ఖలీఫాతుల్లాబాషాని ఘనంగా సన్మానించారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: