సీఎం వై.ఎస్.జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

క్రిస్మస్‌ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగానున్న క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇలా పేర్కొన్నారు... దైవ కుమారుడు జీసస్‌ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని,  క్రిస్మస్‌ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని జగన్‌ గారు అన్నారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్‌ తన జీవితం ద్వారా బాటలు వేశారని జగన్‌ అన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం... ఇవీ జీసస్‌ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా అందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: