సుబ్బారావు గుప్తా పై దాడి సిగ్గుచేటు

బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా

(జానో -జాగో వెబ్ న్యూస్_ఏపీ పొలిటికల్ బ్యూరో)

ఒంగోలునగరానికి చెందిన ఆర్యవైశ్య సోదరుడు సుబ్బారావు గుప్తా పై వైసీపీ పార్టీ చెందిన నాయకుడు సుభాని అతని అనుచరుల దాడిని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన ఆర్యవైశ్య కులస్థులనే  కాదు, హింసారహిత రాజకీయాలను కోరుకునే వారందరి మనోభావాల్ని దెబ్బతిందన్నారు. ఆరోగ్యంగా ఉన్న సుబ్బారావు గుప్తా మానసిక పరిస్థి బాగాలేదని వైసీపీ నేతలు చెప్పడం సబబేనా అంటూ హాస్యాస్పదంగా ఉందన్నారు.


భయభ్రాంతులకు గురి అయిన సుబ్బారావు గుప్తా భార్య పిల్లలు తమకు ప్రాణహాని ఉందని  దాడిచేసిన వారి నుంచి తమను రక్షించాలని వారు రోధిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించి, చట్టంపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ముక్తార్ భాషా డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: