హామీ ఇచ్చారు...అమలు చేశారు

ప్రజలు కూడా మనస్సారా ఘన స్వాగతం పలికారు

(జానో జాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

ఎంతో మంది నేతలు వస్తుంటారు...పోతుంటారు. కొందరు మాత్రమే ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకొంటారు. అలాంటి ఘటనయే కర్నూలు జిల్లాలలో జరిగింది. 11వ వార్డు కొండగిరిలోని చక్రాలు రోడ్డు వద్ద సిసి రోడ్డు, డ్రైనేజీ లేక 20 సంవత్సరాలుగా అక్కడి ప్రజలు అవస్థలు పడుతూ వచ్చారు. ఈ సమస్య ఎప్పటికీ తీరుతుందో కానీ రోజులు చాలా గడిచాయి. కానీ ఇటీవల గ్రామపంచాయతీ కాలనీవాసులంతా కలసి గ్రామపంచాయతీ గౌరవ సలహాదారులు ఎస్ నాగరత్నమ్మ ని కలసి సమస్య వివరించారు. దీనిపై స్పందించిన ఆమె సమస్య తీర్చుతానని హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా మూడు రోజుల్లో చెప్పిన మాట ప్రకారం ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేశారు.


వాటికి సంబంధించిన పనులు ప్రారంభించడంతో కాలనీవాసులు పూలమాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాణసంచాలు పేల్చుతూ ఆప్యాయంగా ఆహ్వానించారు. దీంతో అమె అక్కడి ప్రజలకు మరో హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా త్వరలోనే గ్రాండ్ వచ్చిన తదుపరి మేజర్ సమస్యలు కూడా  చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలావుంటే పనుల ప్రారంభోత్సవానికి భూమి పూజకు సర్పంచ్ ఎక్స్ ఎంపి పి ఎస్ నాగరత్నమ్మ, మాజీ సర్పంచ్ శేఖర్, వార్డ్ మెంబర్లు సుంకన్న, భాష, మహమ్మద్ భాష, రామాంజనేయులు, రంగన్న,  కొమ్ము నెట్టేకళ్ళు, కాలనీవాసులు   పాల్గొన్నారు.


 





,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: