రైతు బాంధవుడు...చరణ్ సింగ్

"జై జవాన్,జై కిసాన్ "అనే నినాదాన్ని భారత దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చారు.దేశ సరిహద్దులలో సైనికులు నిరంతరం కాపలా కాస్తూ ప్రజలని రక్షిస్తుంటారు.దేశం లోపల అన్నదాతలు కాయాకష్టం చేసి ప్రజలకి కావలసిన ఆహార ధాన్యాలని పండిస్తారు. కరోనా సమయంలో మిగతా పరిశ్రమలన్నీ మూత పడినా,వ్యవసాయ రంగం మాత్రం సంక్షోభాన్ని ఎదుర్కోలేదు.దేశంలో ఇప్పటికీ 60 శాతం మంది వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవిస్తున్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తొలి పంచ వర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. నెహ్రూతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్ కూడ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. స్వతంత్రానికి ముందు, తర్వాత కూడా చరణ్ సింగ్ రైతుల హక్కుల కోసం పలు ఉద్యమాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారి క్షేమం కోసం పలు చర్యలు చేపట్టారు.


రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి వీలుగా దళారుల ప్రమేయాన్ని నివారించేందుకి పలు చర్యలు చేపట్టారు.1953లో ఉత్తరప్రదేశ్ లో జమీందారి వ్యవస్థని రద్దు చేశారు. చిన్న సన్న కారు రైతులని ప్రోత్సహించారు.దేశానికి వెన్నుముక రైతు అని నమ్మారు.కుటీర పరిశ్రమలని ప్రోత్సహించారు.కౌలు రైతుల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకున్నారు.ఒకప్పుడు రైతులు ధనవంతులనుండి,వ్యాపారస్తుల నుండి పెద్ద ఎత్తున రుణాలు తీసుకునేవారు. అప్పులు సకాలంలో చెల్లించలేక,ఆత్మహత్య చేసుకొనేవారు.దేశంలో ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులే కన్పిస్తున్నాయి. రైతుల రుణ విముక్తి కోసం ఆయన పోరాడారు.ల్యాండ్ హోల్డింగ్ చట్టం తీసుకొచ్చారు.

ముఖ్యమంత్రిగా,వ్యవసాయ శాఖ మంత్రిగా, ప్రధానిగా ఆయన పలు బాధ్యతలు స్వీకరించారు. ఆయన జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు.1902 డిసెంబర్ 23న జన్మించిన చరణ్ సింగ్ స్వాతంత్ర్య సమర యోధుడిగా,గాంధేయవాదిగా,రైతు బాంధవుడిగా పేరు పొందారు.1987 మే 29న తుదిశ్వాస విడిచారు.ఆయన సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా అన్నదాతలకి ఇంకా కష్టాలు తీరలేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండటం లేదు. రోజురోజుకూ ఎరువుల ధరలు మరింత పెరుగుతున్నాయి.నకిలీ విత్తనాల బెడద వారిని వెంటాడుతుంది. చరణ్ సింగ్,ఎం జి.రంగా వంటి నాయకులని స్ఫూర్తిగా తీసుకొని నేటి పాలకులు రైతుల సంక్షేమం కోసం వివిధ రకాల చర్యలు తీసుకోవాలి.

రచయిత-యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ రాబోతోంబది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి






            


 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: