మాజీ ఎమ్మెల్యే జంకె. వెంకట్ రెడ్డి, నివాసంలో...

ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు

(జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్  జగన్  బర్త్ డే వేడుకలను మాజీ ఎమ్మెల్యే జంకె. వెంకట్ రెడ్డి నివాసంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల  సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంకె. వెంకటరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రాష్ట్రంలో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చి సంక్షేమ సారధిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తున్నారని,


రెండున్నరేళ్లుగా ప్రజాహితమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రజలకు మంచి చేసే విషయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన తనయుడిగా వైఎస్‌ జగన్‌ రెండడుగులు ముందే ఉన్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారని, కరోనా సంక్షోభంలోనూ పథకాలు ఆగలేదని తెలిపారు.

పేదలకు మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్యను చేరువ చేస్తున్న ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. ప్రజాహితమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న వైఎస్‌ జగన్‌ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి




       

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: