ఎనభైశాతం సబ్సీడీతో...
శనగ విత్తనాల పంపిణీ
(జానో జాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం లోని తర్లుపాడు మరియు శీతానాగులవరం రైతు భరోసా కేంద్రాలలో తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి ఆర్ చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో 80% రాయితీపై శనగ విత్తనాలనుపంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి తర్లుపాడు మండల అధ్యక్షురాలు సూరెడ్డి భూలక్ష్మి పాల్గొని రైతులకు 80% రాయితీతో ఇస్తున్న విత్తనాలను పంపిణీ చేయడం జరిగినది. మార్కాపురం వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్ రమాదేవి మాట్లాడుతూ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు80% రాయితీ మీద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి ఆర్. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ 80% రాయితీ మీద తీసుకున్న విత్తనాలను రైతులు తప్పనిసరిగా వేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తర్లుపాడు మరియు శీతానాగులవరం సర్పంచులు, వైస్ సర్పంచులు, తర్లుపాడు మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి, మండల అడ్వైజర్ బోర్డు చైర్మెన్స్, మండల రైతు సంఘం నాయకుడు ఏరువా.పాపిరెడ్డి, వ్యవసాయ విద్యార్థి సడక్, తర్లుపాడు మండలం వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: