సీఎం జగన్‌ వద్దకు పీఆర్సీ నివేదిక 

అందజేసిన సిఎస్ సమీర్ శర్మ

ఖజానాపై 8వేల నుంచి 10వేల కోట్లు భారం

(జానో -జాగో వెబ్ న్యూస్_ఏపీ ప్రతినిధి)

సుదీర్ఘ కసరత్తు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సి నివేదిక తయారు అయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పీఆర్సీ నివేదికను కమిటీ అందజేసింది. చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలకు చీఫ్‌ సెక్రటరీ.. నివేదిక ఇవ‌క్వ‌నున్నారు.


ముఖ్యమంత్రికి పీఆర్సీ నివేదిక అందజేసిన అనంతరం సీఎస్ సమీర్‌ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందిస్తామన్నారు. నివేదికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని తెలిపారు. అనేక  అంశాలను సిఫారసు చేశామన్నారు. ప్రభుత్వంపై రూ.8 వేల నుంచి రూ.10వేల కోట్ల భారం పడనుందని, ఫిట్‌మెంట్‌పై సీఎం జ‌గ‌న్‌కు 11 ప్రతిపాదనలు ఇచ్చామని సీఎస్ తెలిపారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని సీఎస్‌ తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: