అరుదైన రికార్డ్ రాక్ వెల్ పబ్లిక్ స్కూల్ సొంతం

దేశంలో 8వ, రాష్ట్రంలో 1 వ ర్యాంకు


(జానో జాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములో స్థాపించి అనతికాలంలోనే రాక్ వెల్ పబ్లిక్ స్కూల్ ప్రకాశం జిల్లా ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే గాక రాష్ట్రంలో 1, దేశంలో 8 వ  ర్యాంకు పొందింది. ఈ సందర్భంగా  నేడు న్యూఢిల్లీలో జరిగిన ఎడ్యుకేషన్ వరల్డ్ గ్రాండ్ జ్యురీ ఇండియా స్కూల్ 2021-2022 సంవత్సరం అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమంలో  రాక్ వెల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వెన్నా నాగార్జున రెడ్డి బెస్ట్ డిజిటల్ లెర్నింగ్ ఇన్ఫ్రా స్టక్చర్ అవార్డ్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న నాగార్జున రెడ్డి మాట్లాడుతూ...


రోజు రోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో, ముఖ్యంగా భవిష్యత్తులో సమాజాన్ని శాసించే విధంగా రానున్న డిజిటల్ ఎడ్యుకేషన్ ను విద్యార్థులకు అందిస్తున్నామని అన్నారు. అలాగే యాంత్రిక విద్యను గాకుండా సృజనాత్మకను పెంపొందించే విధంగాను విద్యార్థులకు విద్యా బోధన చేయడం జరుగుతుందని అన్నారు. స్కూల్ స్థాపించిన రెండవ సంవత్సరంలో దేశంలో 8, రాష్ట్రంలో ప్రధమ స్థానం మార్కాపురంలో రాక్ వెల్ పబ్లిక్ స్కూల్ ఉన్నతమైన ర్యాంకింగ్ సాధించడం చాల ఆనందంగా ఉందని, ఈ ర్యాంకు సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన స్కూల్ సిబ్బందికి డైరెక్టర్ వెన్నా నాగార్జున రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

           




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: