కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌  ఉద్యోగులకు ధీమా

ఎంటీఎస్‌ సహా పలు ప్రయోజనాల వర్తింపు

దాదాపు 3రెట్లు పెరిగిన జీతభత్యాల బిల్లు

రూ.1198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు..

(జానో జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)

ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం 2019 నుంచి రాష్ట్రప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకున్నట్టు కార్యదర్శుల కమిటీ తన నివేదికలో తెలిపింది. 27 శాతం ఐఆర్‌ అమలు, అంగన్‌వాడీ, ఆశ, ఇతర ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల కారణంగా ప్రభుత్వంపై అదనపు భారం పడినట్టు పేర్కొంది. 

ప్రభుత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్‌లకు రాష్ట్రప్రభుత్వం 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్‌ అమలు చేస్తోంది. 

2019 జూలై 1 నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఐఆర్‌ కింద ఉద్యోగులు, పెన్షనర్‌లకు రూ.15,839.99 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.11,270.21 కోట్లు, ఉద్యోగుల కోసం, రూ.4,568.78 కోట్లు పెన్షనర్‌ల కోసం వెచ్చించింది. 

అంగన్‌వాడీలు, ఆశావర్కర్‌లు, హోమ్‌గార్డులు సహా 3,01,021 మంది ఉద్యోగులకు జీతాలు, రోజువారీ వేతనాలు పెంపొందించింది. వీరి వేతనాలు, జీతాల కోసం సంవత్సరానికి చేస్తున్న ఖర్చు రూ.1,198  కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది.


కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌

కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వీరికి మినిమం టైమ్‌ స్కేల్‌ను అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూన్‌ 18న టైమ్‌ స్కేల్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. మొదటి రెండు ప్రసవాలకు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులను వర్తింపచేసింది. 

కాంట్రాక్టు ఉద్యోగి యాక్సిడెంటల్‌గా మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను వర్తింప జేసింది. 

అదనంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కల్పించిన వసతులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.360 కోట్ల మేర ఖర్చు చేస్తోంది.  

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

          

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: