డిసెంబర్‌ 21న ...

‘సచివాలయ’ దినోత్సవం

కృతజ్ఞతగా సీఎం పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొందాం    

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పిలుపు

(జానో -జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)

సీఎం జగన్‌ వల్లే ఒకేసారి లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని కృతజ్ఞతగా ఆయన పుట్టినరోజున ఉత్సవాలు.. ఉద్యోగులంతా పాల్గొనాలనీ  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పిలుపు   

రాష్ట్రంలో ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతగా.. ఆయన పుట్టినరోజైన డిసెంబర్‌ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతేడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, ఈసారి మరింత ఉత్సాహంతో వేడుకలు నిర్వహించాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.  


సచివాలయాల సిబ్బంది అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులెవ్వరూ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. కొత్త పీఆర్సీ కూడా వర్తిస్తుందని అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ వ్యవస్థను సృష్టించి లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ఇస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు ఉద్యోగులు రుణపడి ఉంటారన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


            


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: