నేడు విజయవాడ కు రానున్న ఉమెన్ చాందీ

21,22 తేదీలలో విజయవాడ లో బస

ఆంధ్ర రత్న భవన్ లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న ఉమెన్ చాందీ


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీ నేడు (మంగళవారం) రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈనెల 21,22 తేదీలలో ఆయన విజయవాడ లో బస చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ  నేతలతో జరిగే సమావేశాల్లో పాల్గొంటారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు. 21వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆహ్వానితులు, సీనియర్ నాయకులతో ఉమెన్ చాందీ సమావేశమవుతారు. అలాగే 22న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో పీసీసీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1గంట నుంచి 3 గంటల వరకు పలువురు పార్టీ శ్రేణులు ఆయనతో సమావేశమవుతారు.

నేడు ఆంధ్ర రత్న భవన్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు

రానున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం 7 గంటలకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లోఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పాల్గొంటారని  ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి , ఇంఛార్జి (ఆర్గనైజేషన్) పరస రాజీవ్ రతన్ వెల్లడించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు కావాలని కోరారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: