ఎల్ఐసి వారి ఆధ్వర్యంలో,,,

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డు ....మెరిట్ సర్టిఫికెట్స్

(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం లోని స్థానిక జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున ఎల్ ఐ సి మార్కాపురం బ్రాంచి వారి ఆధ్వర్యంలో 6 నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినిలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థినిలకు స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డ్స్ మరియు మెరిట్ సర్టిఫికెట్స్ ను ప్రధానోపాధ్యాయురాలు  శ్రీదేవి అధ్యక్షతన ఎల్ ఐ సి సీనియర్  బ్రాంచి మేనేజర్  పి.మహేశ్వర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ ఐ సి సంస్థ గత 66 సం. లుగా జీవిత బీమా రంగంలో పాలసీదారులకు మెరుగైనసేవలందిస్తుందన్నారు.అంతేకాకుండా సామాజిక సేవ కార్యక్రమాల్లో కూడా తన వంతు బాధ్యత నిర్వహిస్తుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచి మేనేజర్ భాస్కర రావు, ఏ. ఓ. పి. సుబ్బారావు, ఆఫీస్ సిబ్బంది వై నాగేశ్వర రావు,జె. శ్రీనివాస రెడ్డి,పి. శ్రీనివాస రావు, ఏజెంట్స్ లియాఫీ నాయకులు ఇమాం సాహెబ్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.పాఠశాల ఉపాధ్యాయ,ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: