సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే

18 ఏళ్లకే ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు...

కానీ పెళ్లి చేసుకోకూడదా

జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా

(జానో జాగో వెబ్ న్యూస్_నంద్యాల ప్రతినిధి)

 మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అమ్మాయిల పెళ్లి వయసు 18 నుంచి 21సంవత్సరాలు పెంచి చట్టం చేయడం దారుణమని        జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా,  మైనార్టీ నాయకులు కోట్ల ఖలీల్  అన్నారు. బిజెపి ప్రభుత్వం లో నెలకొన్న సమస్యలపై నుంచి ప్రజల ల దృష్టి మరల్చేందుకే ఇలాంటి చట్టాలను బిజెపి ప్రభుత్వం తీసుకొస్తుందని వారు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసున్న అమ్మాయి ఒక ఎమ్మెల్యేను ఎంపీని ఎన్నుకోవచ్చు కానీ అమ్మాయి పెళ్లికి అర్హురాలు కాదని అమ్మాయి పెళ్లి వయసు ను పెంచడం ఇది ప్రధాని నరేంద్ర మోడీ మరి


బిజెపి అసలు స్వరూపం అని భారతదేశంలో యుగాలుగా జరుగుతున్న సంప్రదాయాన్ని మార్చాలని చూడం మోడీ అసలు స్వరూపమని అలాగే అమెరికాలో కూడా 18 ఏళ్ల కె అమ్మాయి పెళ్లి వయసు చట్టం ఉందని ప్రధానికి మహిళలపై నిజమైన ప్రేమ ఉంటే వారికి ఉద్యోగాల్లో చట్టసభల్లో వారికి రిజర్వేషన్ కల్పించాలని బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళ పారిశ్రామికవేత్తలు గా తయారుచేయాలని అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను కట్టడి చేయాలని కఠిన చట్టాలు అమలు చేయాలని మహిళ పురోగతికి సహాయ పడాలని వారు అన్నారు.


            


 


    Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: