జనవరి 10 నుండి 12వ తేదీ వరకు జరిగే
ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి
పోస్టర్ ఆవిష్కరణలో రైతు సంఘం నాయకులు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి 10 నుండి 12 తేది వరకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయని, సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లను రైతు సంఘం నాయకులు ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎంఎల్‌ఏ జూలకంటి రంగారెడ్డి, ఏఐకెఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.జంగారెడ్డి, టి.సాగర్, ఆహ్వాన సంఘం కోశాధికారి బొంతల చంద్రారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహ్మరెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి, టి.సాగర్ మాట్లాడుతూ.. 10వ తేదిన జరిగే సెమినార్‌కు అఖిల భారత కిసాన్ సభ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా, విజ్జుకృష్ణన్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొంటారన్నారు. గత 2 సంవత్సరాలుగా దేశ వ్యాపితంగా నిర్వహించిన ఆందోళన, పోరాటాలను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశాలలో రూపోందిస్తారని అన్నారు. 29 రాష్ట్రాల నుండి 2 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి నిష్ణాతులైన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యలను అరికట్టలేకపోయాయని అన్నారు. ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. బ్యాంకులు ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం మార్చి 31 నాటికి బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లలో 18% వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. కానీ ఏ ఒక్క బ్యాంకు కూడా అమలు చేయడం లేదని అన్నారు. వీటిని అమలు చేయించుకునేందుకు ప్రత్యక్ష కార్యాచరణ చేయాలని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సమస్యపై రైతులందరు ఐక్యంగా కదలాలని అన్నారు. మార్కెట్‌లలో మధ్య దళారీ వ్యవస్థను నిర్మూలించాలని అన్నారు. కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని రైతులకు అవసరమైనన్ని రుణాలు బ్యాంకుల ద్వారా ఇవ్వాలని కోరారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?
ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: