తవ్వేకొద్ది వెలుగులోకి...
రూ.257 కోట్లకుపైగా నగదు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం
విస్తుపోయిన అధికార్లు
(జానో జాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)
సుధీర్ఘ తనిఖీల అనంతరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్ సుగంధ ద్రవ్యాల వ్యాపారి, సమాజ్‌వాదీ పార్టీ నేత పీయూష్ జైన్ నివాసంలోనుంచి రూ.257 కోట్లకుపైగా నగదు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం చేసుకొన్నారు. ఇది ఎక్కడ అని అనుకొంటున్నారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్ సుగంధ ద్రవ్యాల వ్యాపారి, సమాజ్‌వాదీ పార్టీ నేత పీయూష్ జైన్ నివాసంలోనే. గత గురువారం ఉదయం మొదలైన తనిఖీలు. ఆదివారం వరకు సాగాయి. దాదాపు 50 గంటల పాటు పీయూష్ జైన్‌ను విచారించిన అనంతరం ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పీయూష్ జైన్ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గత వారం జీఎస్‌టీ, ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పీయూష్ ఇంట్లోని రెండు బీరువాల్లో గుట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆ మొత్తాన్ని లెక్కించడానికి దాదాపు నాలుగు రోజుల సమయం పట్టింది. మొత్తంగా రూ.257కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్ సుగంధ ద్రవ్యాల వ్యాపారి, సమాజ్‌వాదీ పార్టీ నేత పీయూష్ జైన్ నివాసంలో జీఎస్‌టీ, ఐటీ దాడులకు సంబంధించి అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. దాదాపు 120 గంటల పాటు కొనసాగిన ఈ సోదాల్లో రూ.257 కోట్లకుపైగా నగదు, కిలోల కొద్దీ బంగారం, ఖరీదైన ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీయూష్ జైన్ భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పీయూష్ జైన్ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గత వారం జీఎస్‌టీ, ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పీయూష్ ఇంట్లోని రెండు బీరువాల్లో గుట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆ మొత్తాన్ని లెక్కించడానికి దాదాపు నాలుగు రోజుల సమయం పట్టింది. మొత్తంగా రూ.257కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా పన్ను ఎగవేతతో మొత్తంగా రూ. 1000కోట్ల వరకు కూడబెట్టినట్టు భావిస్తున్నారు. పీయూష్ ఇంట్లో నోట్ల కట్టల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే నగదుతో పాటు వివిధ ప్రాంతాల్లో 16 విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్‌లో 4, కన్నౌజ్‌లో 7, ముంబయిలో 2, ఢిల్లీలో ఒకటి ఉన్నట్టు గుర్తించగా.. దుబాయ్‌లో మరో రెండు ఆస్తులున్నట్లు తేలింది. ఆదివారం నాటి సోదాల్లో మరో రూ.10 కోట్లు నగదు బయటపడింది. కన్నౌజ్‌లోని పీయూష్ జైన్ పూర్వీకుల నివాసంలో 18 లాకర్లను గుర్తించిన అధికారులకు.. వీటికి సంబంధించి మరో 500 తాళాలు కూడా లభించినట్టు సమాచారం. ఆ లాకర్లను తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?
ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
