కలుజువ్వలపాడు గ్రామ  సచివాలయంలో,,,

 వన్ టైం సెటిల్మెంట్ (ots) అవగాహన కార్యక్రమం


(జానో -జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)

 ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని ఎంపీడీవో        ఎస్ నరసింహులు ఆధ్వర్యంలో  కలుజువ్వలపాడు సచివాలయం నందు మండల ప్రత్యేక అధికారి రమాదేవిగారు ( ఏ డి ఏ )జగనన్న సంపూర్ణ గృహ హక్కు పత్రం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఎంపీడీవో ఎస్ నరసింహులు మాట్లాడుతూ గృహ నిర్మాణానికి సంబంధించి 1983-84 నుండి 2011-12 సంవత్సరకాలం లోని వివిధ హౌసింగ్ స్కీమ్ నందు ఇంటి నిర్మాణాలు నిర్మించుకున్నటువంటి లబ్ధిదారుల నుండి ఓ టి ఎస్ పద్ధతిలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పత్రం లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. గ్రామ సచివాలయంలోని  రిజిస్ట్రేషన్ చేసి సంపూర్ణ గృహ పథకం కింద లబ్ధిదారులకు నవంబర్ 25 నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభించి డిసెంబర్ 5 వరకు చేపట్టడం జరుగుతుందన్నారు మండలంలోని అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో గ్రామ వాలీంటీర్లు,  వివోఎస్ లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గ్రామాలలో పర్యవేక్షణ నిర్వహించి అర్హులైన  లబ్ధిదారులను అందరికీ అవగాహన కల్పించి  జగనన్న  సంపూర్ణ గృహహక్కు పత్రం పొందేలా చూడాలని తెలిపారు.


ఏ పి ఎం పిచ్చయ్య గారు మాట్లాడుతూ  రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానిని అమ్ముకునే సదుపాయం  కలదు మరియు లోన్ సౌకర్యం ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేనిచో పొదుపు గ్రూప్ లో ఉన్నట్లయితే  సభ్యులతోసమావేశం నిర్వహించి గ్రూపు సభ్యుల సమక్షంలో బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి సూరెడ్డి భూలక్ష్మి, ఎమ్మార్వో  శైలేంద్ర కుమార్, హౌసింగ్ ఏఈ, మండల వ్యవసాయ అధికారి ఆర్. చంద్రశేఖర రావు,  ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సృజన, వైసిపి నాయకులు రమణారెడ్డి, వెన్న.సత్యనారాయణ రెడ్డి, రాగ సముద్రం సర్పంచ్ రమణారెడ్డి,కలుజువ్వలపాడు సర్పంచ్ శిరోమణి, సచివాలయ సిబ్బంది, యన్.ఆర్.జి.ఎస్.

సిబ్బంది,ఏ.ఎస్.ఐ.సంజయ్, వాలంటీర్లు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: