అధఃపాతాళానికి తొక్కేసినా వ‌క్ర‌బుద్ధి మారలేదు

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు


(జానో -జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)

'తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలి అని చంద్రబాబు కోరుకుంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడి అసలు నువ్వు 'మనిషివా చంద్రబాబు' అనే పరిస్థితి తెచ్చుకున్నాడు అని ఆయన పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన‌ చంద్రబాబు నాయుడు ప్ర‌ద‌ర్శించిన తీరు బాగోలేద‌ని ఆయ‌న అన్నారు.  

''గాల్లో కలిసిపోతారని సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వక్రబుద్ధి ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదన్నారు. వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడి 'మనిషివా చంద్రబాబు' అనే పరిస్థితి తెచ్చుకున్నాడని. తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలనుకుంటున్నాడు'' అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: