అటహాసంగా గ్రంథాలయ వారోత్సవాలు

హాజరైన మార్కాపురం పట్టణ ప్రముఖులు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములో 54 వ గ్రంథాలయ వారోత్సవాలు, 75 సం.ల స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు,బాలల దినోత్సవం  మార్కాపురం గ్రంధాలయంలో  ఘనంగా ప్రారంభమయ్యాయి. జెండా వందనం ,నెహ్రూ పటానికి పుష్పాలంకరణ తో కార్యక్రమం మొదలయ్యింది. ప్రముఖ కవి రచయిత అన్నపురెడ్డి వీరారెడ్డి జీవితంలో పుస్తక ప్రాముఖ్యతను వివరించారు.మరో కవి కె.వి.రమణారెడ్డి శ్రీ శ్రీ రచించిన మహాప్రస్థానం యొక్క పెద్ద సైజ్ పుస్తకాన్ని గ్రంధాలయానికి బహుకరించారు.

ఈ కార్యక్రమంలో బాలుర ఉన్నతపాఠశాల ఎన్ సీసీ విద్యార్థులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రంధపాలకుడు శివారెడ్డి, చెన్నారెడ్డిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. శ్రీనివాసరావు, బాలుర ఉన్నతపాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఒద్దుల వీరారెడ్డి, అన్నపురెడ్డిశంకరరెడ్డి, సుబ్బారావు, రమణ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఒద్దుల రవిశేఖర్ రెడ్డి సమన్వయం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.


 



✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– , 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: