ఇబ్బందులు కలగకూడదనే..

వరద ప్రాంతాల్లో పర్యటించ లేదు

ఈ పరిస్థితుల్లో పర్యటనకు వెళితే.. సహాయక చర్యలకు విఘాతం కలిగే అవకాశం ఉంది

అందుకే వెళ్లలేదు... అర్థం చేసుకోండి

పరామర్శించడానికి వెళ్ళిన నాయకుడు భరోసా ఇవ్వాలి

అంతేకానీ విద్వేషాలు రెచ్చగొట్టడమా

సీఎం గారు లో వస్తాడు గాలిలోని కలిసిపోతాడు అన్నారు చంద్రబాబు

బాబు సంస్కారానికి నా నమస్కారం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి


(జానో -జాగో వెబ్ న్యూస్_ఏపీ పొలిటికల్బ్యూరో)

  అందించే వరద సహాయక చర్యలకు ఆటకం ఏర్పడ కూడదని తాను వరద ప్రాంతాల్లో పర్యటించలేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారుల సూచన మేరకే తాను ఇలా చేశానని ఆయన వెల్లడించారు. వరద ప్రాంతాల్లో తాను పర్యటిస్తే ముఖ్యమంత్రి వచ్చారని అధికారులంతా నా పర్యటన పైన దృష్టి పెడతారని, సహాయక చర్యలు పక్కనపెట్టి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్దేశంతోనే తాను వరద ప్రాంతాల్లో పర్యటించలేదన్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక కచ్చితంగా బాధితులతో మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. తాను వరద ప్రాంతాల్లో పర్యటించలేదని ప్రతిపక్షాలు విమర్శలు సంధించడం సరికాదన్నారు. తాను వరద ప్రాంతాల్లో ప్రజల కోసమే పర్యటించలేదని ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.

విపత్తును విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ రాజకీయాల కోసం బురద జల్లుతున్నారన్నారని, నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని విమర్శిస్తున్నారని, శాశ్వతంగా కనుమరుగైపోతానని ప్రతిపక్ష నేత అన్నారు అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇ పేర్కొన్నారు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం. వరద సహాయక చర్యలు ఆగకూడదనే నేను వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. సీనియర్‌ అధికారుల సూచనల మేరకే ఆగిపోయానని నేను వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందడం ముఖ్యమాని, జిల్లాకొక సీనియర్‌ అధికారిని పంపామాని ఆయన పేర్కొన్నారు. ఇంకా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ '''మంత్రులు, ఎమ్మెల్యేలను అక్కడే ఉండమన్నాం. నేను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించాను. సహాయక చర్యల తర్వాత కచ్చితంగా పర్యటిస్తా. హుద్‌హుద్‌, తీత్లీ తుఫానులను తానే ఆపానంటారు చంద్రబాబు. అప్పట్లో బాధితులకు అరకొర సహాయం కూడా చేయలేకపోయారని’’ సీఎం జగన్‌ అన్నారు. ‘‘ఇటీవల కురిసిన వర్షాలకు 3 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. వానలు రాయలసీమను ముంచెత్తడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. నీళ్లు లేక అలమటించే రాయలసీమలో అనూహ్య వరదలు సంభవించాయి. కొన్ని చోట్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది.


నష్టం వివరాలు ఎక్కడా దాచిపెట్టడం లేదు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని’’ అని సీఎం అన్నారు. ‘‘రిజర్వాయర్ల భద్రత పర్యవేక్షణకు సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తాం. నీటి నిల్వల పర్యవేక్షణకు కొత్త సాంకేతిక విధానాన్ని తీసుకొస్తాం. గతంలో వరదలు వస్తే చంద్రబాబు ఏ ఒక్కరిని ఆదుకోలేదు. ప్రభుత్వాన్ని ఎలా డ్యామేజ్‌ చేయాలన్నదే పత్రికల్లో రాస్తారు. వరద ముంపు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.5లక్షలు అందించాం. వరద ప్రభావిత జిల్లాల్లో 100 శాతం విద్యుత్‌ పునరుద్ధరణ చేశామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.అపార్ధం చేసుకోవద్దు...

 వరదల వల్ల జనం కకావికలమవుతుంటే సీఎం జగన్ వర్క్ ఫ్రం హోం అంటూ జనసేన, తుపాను ప్రభావిత ప్రాంతాలకన్నా విందులు వినోదాలు జగన్ కు ముఖ్యమని ప్రతిపక్ష పార్టీ, వరదలొచ్చి అంతా కొట్టుకుపోతుంటే ఏరియల్ సర్వే చేస్తే సరిపోతుందా అని బీజేపి చేసిన విమర్శలు చేయడాన్ని సీఎం జగన్  ఖండించారు. ముఖ్యమంత్రిగా అక్కడ పర్యటనకు వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకాలు కలుగుతాయనే వెళ్లలేదని సీఎం స్పష్టం చేశారు. తాను వెళ్లడం వల్ల అధికారులంతా తన వెంటే తిరుగుతారని దీని వల్ల సహాయం ఆగిపోతుందన్నారు.ఈ విషయంపై తాను ఉన్నతాధికారులతో మాట్లాడితే ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఎప్పుడూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదన్న అంశాన్ని ఇక్కడ జగన్ గుర్తు చేశారు. వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందర్నీ సహాయచర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. అలాగే రోజూ సమీక్షలు నిర్వమిస్తూ యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తున్నట్టు జగన్ స్పష్టం చేసారు. ఏరియల్ సర్వే కూడా చేశానని, సహాయ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి, బాదితుల సమస్యలతో పాటు అధికారులు చేసిన సహాయ కార్యక్రమాల గురించి ఆరా తీస్తానని వివరించారు. కడప తన సొంత జిల్లా అని ప్రేమ కాస్త ఎక్కువే ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. వరద బాధిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, గాల్లో వచ్చారు, గాల్లోనే పోతారని మాట్లాడారని, ఆయన సంస్కారానికి హాట్సాఫ్ అన్నారు . తాము శరవేగంగా సహాయ కార్యక్రమాలు అందించామని, చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా మానవత్వం చూపించారా అని ప్రశ్నించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు శరవేగంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చామన్నారు. వెయ్యి కాదు, రెండు వేలు కాదు ఏకంగా 90వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. పశువులు నష్టపోయిన వారికి కూడా నష్టపరిహారం ఇచ్చామని జగన్ ప్రకటించారు. అన్ని వర్గాలకూ నష్టపోయిన వారికి పరిహారం అందించామన్నారు. అసాధారణ రీతిలో వచ్చిన వాన, వరదల వల్ల ఉపద్రవం వచ్చిందని జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఎక్కడా మానవ తప్పిదం లేదన్నారు. ముందస్తుగానే ఆయా గ్రామాల ప్రజలందరిని అప్రమత్తం చేశారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. ఓ పత్రికలో ఈ మేరకు వచ్చిన ఓ వార్తను సీఎం అసెంబ్లీలో చూపించారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రిజర్వాయర్‌ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరిస్తామని, భవిష్యత్‌లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘‘నాయకుడు అనేవాడికి  ప్రజలకు జరగాల్సిన మంచి సరైన పద్దతిలో, అందరికి అందుతుందా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. అంతేతప్ప. బాధితుల దగ్గరకు వెళ్లి డ్రామాలు చేయడం కాదు. లీడర్‌ అంటే అక్కడకు వెళ్లి పనులు సరైన పద్దతిలో జరుగుతున్నాయా లేదా పరిశీలించాలి. కార్యక్రమాలు సరైన పద్దతిలో జరిగేలా చూడాలి’’ అని సీఎం జగన్‌ తెలిపారు. ‘‘ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అధికారులు నాకు స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారు. సస్కారానికి నా నమస్కరం’’ అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: