అవి రోడ్ల,, ప్రమాదపు రహదారుల

ప్రమాదపు అంచుల్లో...... వాహనదారులు


(జానో - జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

రోడ్లు కాస్త ప్రమాద రహదారి గా మారుతున్నాయి. వాహనాలు పరిగెత్తాల్సిందే రోడ్లలో వరి వేయడం కారణంగా రోడ్లు కాస్త మాయమవుతున్నాయి. దీంతో రోడ్ ఎక్కుతున్న వాహనదారుడు తాను వెళ్తున్నది రోడ్డుపైనే అన్న భ్రమలో పడి.. రోడ్డుపై వరి అడ్డంగా ఉండడం చూసి .. అకస్మాత్తుగా ఎటు వెళ్లాలో బిత్తరపోయి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి సమయంలో ఈ పరిస్థితి ప్రమాదాలకు దారి తీసే అవకాశం మిఇక వివరాల్లోకి వెళితే.

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజవర్గం, గడివేముల మండల పరిధి లోనీ రహదారులపై వెళ్లడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బూజు నూరు గ్రామం నుండి నంద్యాలకు వెళ్లే వరకు సిమెంట్ రోడ్డు ఉండడంతో నిత్యం జిందాల్ సిమెంటు ఫ్యాక్టరీ నుండి నంద్యాల మీదుగా సుమారు రోజు 500 లారీలు వస్తూ పోతూ ఉంటాయి. అయితే , రైతులు తమ పొలాల్లో చేతికి వచ్చిన పంటను కోసి ప్రధాన రహదారులపై పోసి ధాన్యపు గింజలను ఆరబెట్టుకున్న ఉన్నారు. రైతులు పంట చేతికి వచ్చిన ధాన్యపు గింజలను రైతుల ఇంటి వద్ద కానీ, వారి కలాలో కానీ, ఎవరికీ ఇబ్బంది కలగని బహిరంగ ప్రదేశాలలో కానీ గింజలను తరలించి ధాన్యపు గింజలు ఆరబెట్టుకోవాలి,


అంతేకానీ నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై ధాన్యపు గింజలను రోడ్డుకు సగం వరకు పోసి ఆర పెట్టుకోవడం తో ఎదురుగా ఒక వాహనం వస్తే ఒక వాహనం నిలబెట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి గడివేముల మండలంలో నిత్యం కనబడుతుంది. రాత్రి వేళల్లో అయితే క్రింద పోసిన ధాన్యపు గింజలు ద్విచక్ర వాహనదారులకు దగ్గరికి వచ్చే వరకు సరిగా కనపడక కింద పడి గాయాల బారిన పడ్డ సంఘటనలు , కొంత మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి.

ఈ ప్రధాన రహదారిలో ప్రతి రోజు ఉన్నతాధికారులు ,పోలీసు అధికారులు ,ఈరహదారిపై ప్రయాణం చేస్తూ కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అధికారులు స్పందించి రహదారులపై ఉండే అడ్డంకులు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వాహనదారులు కోరుతున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: