మార్కుల విధానం రద్దు చేయాలి

ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కుల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని  ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి డిమాండు చేశారు. మార్కాపురం పట్టణం లోని సాయి డిగ్రీ కళాశాల నందు ఐ.వి.రాఘవమ్మ  అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆశ వర్కర్స్ కు మార్కుల విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని మార్కులను బట్టి వేతనాలు ఇస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు. పంతొమ్మిది అంశాలు కాకుండా ఇతర పనులు చేస్తున్న వాటికి ఎంత డబ్బులు ఇస్తారని ప్రశ్నించారు.వ్యాక్సిన్ బాక్సులు తీసుకు రావడం, తీసుకుపోవడం వారి డ్యూటీ కాకపోయినా చేస్తున్నారన్నారు. టిఏ, డిఏలు అడిగితే మెమోలు ఇస్తాం ఇంటికి వెళ్ళండి అని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొన్ని చోట్ల సచివాలయం పని పేరుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీలు చేస్తున్నారని తెలిపారు. నీకు వయసు అయిపోయింది, ఇంటికి వెళ్ళండి అని, కొంతమంది అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం ఏ రూల్స్ లో ఉందో రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్  మాట్లాడుతూ ఆశా వర్కర్స్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మూడు లక్షలు కల్పించి గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇవ్వాలన్నారు. పనిభారం తగ్గించి మార్కుల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయినా ఆశ వర్కర్ల మీద రాజకీయ వేధింపులు ఇంకా తగ్గలేదు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలను వెంటనే కల్పించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అనంతరం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు  తదితరులు సింగల్ టు యు జిల్లా అధ్యక్షులు డి కె ఎం రఫీ పి రూబెన్, జి. బాలనాగయ్య, వి పుల్లమ్మ, ఎం బాలమ్మ, ఎం మరియమ్మ కొండమ్మ,z. సిప్పోరా అచ్చమ, నాగమ్మ, సుశీల జయలక్ష్మి విశ్రాంతమ్మ, పాల్గొన్నారు.   

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: