క్యాన్సర్‌పై అవగాహన అవసరం
ఎస్సార్సీ ల్యాబోటరీస్ అధినేత డాక్టర్ ఏలూరి
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఎస్సార్సీ ల్యాబోటరీస్ ఫార్మా కంపెనీ అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ క్యాన్సర్ అవగాహనా దినోత్సవం సందర్బంగా మాట్లాడిన ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధితో అనేక మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాణాంతక వ్యాధిని ముందస్తుగా గుర్తించడం అదేవిధంగా క్యాన్సర్ నివారణ గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చేయాలనీ చెప్పారు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుతుందన్న ఏలూరి.. ప్రతి సంవత్సరం క్యాన్సర్ పరీక్ష చేయించుకుంటే మంచిదని సూచించారు. క్యాన్సర్ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయించుకోవాలని..
లేదంటే వ్యాధి ముదిరితే ప్రాణాలకే ముప్పని అన్నారు. ఆధునిక కాలంలో టెక్నాలజీ అభివృద్ధితో క్యాన్సర్ చికిత్సలు మరింత ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, మన దేశంలో చాలా మంది ఇప్పటికీ చికిత్స లేకపోవడంతో మరణిస్తున్నారని వెల్లడించారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా పొగాకు.. మద్యపానానికి శాశ్వతంగా దూరంగా ఉండాలని.. సాధారణ వ్యాయామం తోపాటు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అదేవిధంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పరిమితం చేసే ఆరోగ్యకరమైన ఆహారాన్ని సేవించాలన్నారు ఏలూరి. ఇదిలావుంటే గత పదేళ్లుగా తమ కంపెనీ ఎస్సార్సీ ల్యాబోటరీస్ ఆధ్వర్యంలో క్యాన్సర్ డ్రగ్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయని.. దీనికి సంబంధించి ఎన్నో అవార్డులు వచ్చాయని ఏలూరి తెలిపారు.
Post A Comment:
0 comments: