ఏ.బీ.ఎం. మిషనరీ ఆస్తులు కాపాడుకోవడానికి,,,

ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం

సండ్ర పాటి కాలేబు మాదిగ


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఏ.బీ.ఎం. మిషనరీ ఆస్తులు కాపాడుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఏ.బి.ఎం. మిషనరీ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యుడు సండ్ర పాటి కాలేబు మాదిగ అన్నారు. మార్కాపురం పట్టణం లో గల ఏ.బీ.ఏం. మిషనరీ ఆస్తులను గత కొంతకాలంగా పట్టణానికి చెందిన వ్యక్తులు ఆక్రమించుకోవడమే కాకుండా దళితులకు బలిపీఠం లాంటి దైవ సేవకులు ఉపయోగించుకునే స్టేజినీ సైతం  కూలగొట్టి చదును చేయడంతో మనస్తాపానికి గురైన దళిత బహుజనులు ఈ నెల శుక్రవారం నుండి రిలే దీక్ష కు ప్రకటించిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా శుక్రవారం  నుండి మార్కాపురం పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదురు రిలే దీక్షలు చేస్తున్నటువంటి దళిత బహుజన, దళిత సంఘాల నాయకులను, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున దీక్షకు అనుమతి నిరాకరించడం జరిగింది అని తెలుపుతూ, పట్టణ ఎస్.ఐ. నాగరాజు ఏ.ఎస్.ఐ. సిబ్బందితో మరియు వారి సిబ్బంది తో స్టేషన్కు తీసుకుని వెళ్లి, వారి వారి సొంత పూచీకత్తుపై విడుదల చేసిన పట్టణ ఎస్.ఐ. నాగరాజు, అనంతరం దళిత బహుజన పోరాట సంఘం నాయకులు, ఆర్డీవో కార్యాలయం నందు మార్కాపురం ఏ.బి.ఎం. హై స్కూల్ ను, మరియు మిషనరీ ఆస్తులను కాపాడాలంటూ నిరసన ప్రదర్శించి అనంతరం ఆర్డీవో శివ లక్ష్మి జ్యోతి వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా మిషనరీ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యుడు కాలేబు మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన, దశలవారీగా కార్యక్రమాలు ఉధృతం చేస్తూ ఏ.బీ.ఎo. మిషనరీ ఆస్తులు కాపాడుకోవడానికి  ఏ త్యాగానికైనా సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సండ్ర పాటీ కాలేబు మాదిగ, ఎనీ బేర కిషోర్ మాదిగ, సతీష్, భూదాల కరుణయ్య, రాజేష్,పింకిల్,రాచిటి,ఫిలిప్, సండ్ర పాటీ ప్రకాశ్ రావు, మరియు కొంతమంది దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: