ఇది గౌరవ సభ కాదు.... కౌరవ సభ

కందుల నారాయణరెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం ప్రతినిధి)

అసెంబ్లీ లో నిన్న చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పై వైసీపీ ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యాఖ్యలపై మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిన్న రాష్ట్ర అసెంబ్లీ లో  జరిగిన మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి పై వైసిపి ఎమ్మెల్యేలు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం నాడు మార్కాపురం పట్టణం లోని దోర్నాల బస్టాండ్ సెంటర్ వద్ద గల అన్న నందమూరి తారకరామారావు విగ్రహం ఎదుట మార్కాపురం మాజీ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం నాయకులు కళ్ళకు గంతలు కట్టుకొని తమ నిరసన తెలియజేశారు.


ఈ సందర్భంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ""ఆంధ్రుల ఆరాధ్య దైవం బీసీ, ఎస్సీ, ఎస్ టి, మైనారిటీ లకు పలు విప్లవాత్మక సంక్షేమ ఫలాలు అందజేసి వారందరూ దేవునిగా  కొలుచుకునే స్వర్గీయ నందమూరి తారకరామారావు  కుమార్తె  పై  నిన్న దేవాలయం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వైసిపి ఎమ్మెల్యేలు  చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వ పతనానికి నాంది అని  హెచ్చరించారు. ఇప్పుడు వచ్చిన తుఫాను దెబ్బకు చిత్తూర్, కడప,  నెల్లూరు మరియు అనంతపురం జిల్లాలు ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతూ  అతలాకుతలం అవుతుంటే పాలకులు చోద్యం చూస్తూ పాలనను గాలికి వదిలేసి ప్రజలను రోడ్డును పడవేసి రాష్ట్ర అసెంబ్లీలో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి కుమార్తె చంద్రబాబు నాయుడు

 భార్య శ్రీమతి భువనేశ్వరి దేవి గారిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ కీచకానందం ఆనందం పొందుతున్నారని వారి దిగజారుడు రాజకీయాలకు ఇదే పరాకాష్ట అని, రాష్ట్ర పాలనను గాలికొదిలేసి అవినీతి కుంభకోణాల్లో మునిగితేలుతున్నారు అని మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎనిమిది జడ్పిటిసి పోటీ చేసి మూడు జడ్పీటీసీలు, 110 ఎంపీటీసీ లో పోటీ చేసి నలభై ఒక్క ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నదని దానిని వదిలివేసి తామే అన్ని  గెలిచామని సంకలు గుద్దుకుంటున్నారని నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన తో ప్రజలు చీదరించుకొంటున్నారని  ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రజలు మీ భరతం పట్టాలని చూస్తున్నారని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, మార్కాపూర్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి, మార్కాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవాజి రామానుజుల రెడ్డి,

పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అలంపల్లి శ్రీనివాసరావు, మార్కాపురం పట్టణ కౌన్సిలర్స్ ఎరువ వెంకట నారాయణ రెడ్డి, నాలి కొండయ్య, పిన్నిక మల్లికార్జున, మాజీ కౌన్సిలర్ సయ్యద్ గఫర్, చిలకపాటి పొట్టి చిన్నయ్య,, చలువాది వెంకటేశ్వర్లు, తెలుగుదేశం నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు, పఠాన్ ఇబ్రహీం, గులాబ్, చక్కపెట్టెల జిలాని, బూదాల జాన్ డేవిడ్, భోగి నేని చిరంజీవి,  తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


    

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: