ప్రతి పక్ష నాయకుడు హుందాగా వ్యవహరించాలి

చంద్రబాబు తీరు సరికాదు

మంత్రి పేర్ని నాని

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

ప్రతిపక్ష టిడిపి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదని మంత్రి పేర్ని నాని తప్పు పట్టారు. ప్రతి పక్షం నాయకుడు అంటే ఎంతో హుందాగా వ్యవహరించాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి సహకరించాలే గాని తన కొడుకు వయసు గల రాష్ట్ర ముఖ్యమంత్రి పై వ్యక్తిగతంగా దూషణలు చేయడం శాపనార్థాలు పెట్టడం తగదన్నారు. రాయలసీమ ప్రాంతంలో పలు జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతుంటే... వాటిని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేస్తే... అలాగే గాల్లో కలిసి పోతాడు అని శాపనార్థాలు పెట్టడం ఎంతవరకు సబబు అన్నారు.గతంలో ఆయన సీఎంగా పని చేసినప్పుడు వరద ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించ లేదా అని ప్రశ్నించారు. ఏ ముఖ్యమంత్రి అయిన చేసే పని అదే ననీ, అటువంటప్పుడు తప్పుబట్టడం ఎందుకన్నారు. మా ప్రభుత్వంపై శిరస్సు నుండి పాదాల వరకూ అసూయ ద్వేషాలతో ఆయన రగిలి పోతుండడం వల్లనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నారు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కావాలంటూ అడిగిన చందాన... ఈయన ఎక్కడికి వెళ్ళినా నా భార్య ను నిందించారు... నా భార్య ను నిందించారు... అంటూ మా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయటమే ఈయన అజండా అయిపోయింది అన్నారు. ఆయన భార్యను మేమేదో  నిందించామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.. ఈ ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన ఖండించారు. మా ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని.. తల్లి ,చెల్లి, పిల్లలు ఉన్నారని.. మాకు మానవత్వం ఉంటుందని... మేము ఇతరుల యొక్క ఆడవాళ్ళను విమర్శించే, నిందించే దుస్థితిలో లేమని అన్నారు. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ గతంలో ఈయన సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో పబ్లిసిటీ పిచ్చితో 31మంది మరణానికి కారణమయ్యారని... అదే మానవ తప్పిదం అంటేగాని.... రాయలసీమ ప్రాంతంలో వరదలు రావడం మానవ తప్పిదం కాదని అన్నారు. మరొక విలేఖరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ ఆన్లైన్ సినిమా టికెట్ల విషయంలో జీఓ 35 లో నిర్దేశించిన సినిమా టికెట్ల ధరలను పునఃసమీక్షించాలని పలువురు నటులు, ప్రొడ్యూసర్లు కోరిన విషయం వాస్తవమే నని.. త్వరలోనే ఆ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: