సిప్లా -
భారతదేశపు మొదటి ఫార్మాస్యూటికల్ కంపెనీ
భారతదేశంలోని అత్యుత్తమ మరియు పురాతన ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటైన సిప్లా 1935లో డాక్టర్ ఖ్వాజా అబ్దుల్ హమీద్ చే స్థాపించబడింది. భారతదేశంలో ఫార్మాస్యూటికల్ మరియు కెమికల్ పరిశ్రమ వికాసం లో కెమికల్, ఇండస్ట్రియల్ మరియు ఫార్మాస్యూటికల్ లాబొరేటరీస్ (CIPLA) కీలక పాత్ర పోషించింది. సిప్లా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన ఫార్మాస్యూటికల్ పేర్లలో ఒకటిగా ఉద్భవించింది. సిప్లా ప్రపంచానికి అందని వైద్య అవసరాలను అందించడానికి నిరంతరం కృషి చేస్తుంది. 1935లో సిప్లాను స్థాపించిన తర్వాత, డాక్టర్ హమీద్ తన అవిరళ శ్రమ తో ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చారు. జూలై 4, 1939న మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, డాక్టర్ సుశీలా నాయర్ సిప్లాను సందర్శించారు. 1939లో, మహాత్మా గాంధీ తన మందులతో సహా అన్ని బ్రిటీష్ ఉత్పత్తులను బహిష్కరించినప్పుడు సిప్లాను సందర్శించి, దేశానికి అవసరమైన ఔషధాలను తయారు చేయవలసినదిగా సిప్లా వ్యవస్థాపకుడిని ప్రేరేపించాడు మరియు ఔషదాల విషయం లో స్వయం సమృద్ధి కోసం పిలుపు నిచ్చారు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశం ప్రాణాలను రక్షించే మందుల కొరతను ఎదుర్కొన్నప్పుడు, సిప్లా వాటిని భారత దేశం కోసం తయారు చేసింది. 1960లలో API (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్) తయారీకి మార్గదర్శకత్వం వహించడం ద్వారా భారతదేశంలో బల్క్ డ్రగ్ పరిశ్రమకు సిప్లా పునాది వేసింది. జూలై 30, 1940న స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా ఆజాద్ & అసఫ్ అలీ కూడా సిప్లాను సందర్శించారు. 1970లో, సిప్లా కొత్త పేటెంట్ చట్టానికి నాయకత్వం వహించింది. దీని ద్వారా పేటెంట్ పొందిన ఉత్పత్తిని తయారు చేయడానికి భారతీయ ఔషధ సంస్థ అనుమతించబడింది. ఇది భారతీయ కంపెనీలకు మొట్టమొదటిసారిగా ఏదైనా ఔషధాలను తయారు చేయడానికి మరియు వాటిని భారతీయులందరికీ అందుబాటులో ఉంచడానికి మరియు సరసమైనదిగా చేయడానికి వీలు కల్పించింది.
1978లో, భారతదేశం మీటర్-డోస్ ఇన్హేలర్ (MDI) తయారీ చేసింది. దాంతో ఈ పరికరం యొక్క దిగుమతి నిలిపివేయబడింది. నేడు భారతదేశంలో పీల్చే మందులు మరియు పరికరాలలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రేణి కలిగి ఉంది. ప్రపంచంలోని మొట్టమొదటి ఐరన్ చెలాటర్, డెఫెరిప్రోన్ (iron chelator, Deferiprone) 1994లో సిప్లాచే తొలిసారిగా ప్రారంభించబడింది. ఇది తలసేమియా చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. మొదటిసారిగా తలసేమియాతో బాధపడుతున్న రోగులకు వారి చికిత్స కోసం సరసమైన, సౌకర్యవంతమైన ఎంపిక లబించినది. 1996లో, సిప్లా ప్రపంచానికి మొదటి పారదర్శక పొడి ఇన్హేలర్ (dry powder inhaler) ను అందించింది, ఇది ఉపయోగించడo చాలా సులభం. ఈ పురోగతి భారతదేశంలో ఉచ్ఛ్వాస చికిత్స (inhalation therapy) ను మార్చింది. మిలీనియం సమయంలో, 2001లో, సిప్లా విజయవంతంగా HIV చికిత్స కోసం ఒక రోజుకి ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చుతో యాంటీరెట్రోవైరల్ (ARV)లను విజయవంతంగా కనుగొంది. మిలియన్ల మంది జీవితాలు రక్షించబడ్డాయి. సిప్లా ద్వారా బర్డ్ ఫ్లూ మహమ్మారి సమయంలో 2-3 నెలల్లోనే యాంటీ ఫ్లూ డ్రగ్‌ని అభివృద్ధి చేశారు. 2012లో, సిప్లా క్యాన్సర్ ఔషధాల ధరలను తగ్గించింది, తద్వారా ప్రపంచ స్థాయి ఔషధాలను క్యాన్సర్ రోగులకు అందుబాటులోకి తెచ్చింది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: