వైసిపి కార్యకర్తలా పోలీసులు

అక్రమాలను వదిలి ప్రతిపక్షాన్ని వేధించడమేమిటి?

దొంగఓటర్లను అడ్డుకుంటే అరెస్ట్ లా

నారా చంద్రబాబు నాయుడు 

(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను వదలి  ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకొని వేధించడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. కుప్పంలో నోట్ల కట్టలు పంచుతూ పట్టుబడ్డ వైసీపీ నేతలను అదుపులోకి తీసుకోకుండా తెలుగుదేశం కేడర్ ను పోలీసులు బెదిరించడం అనైతికమన్నారు. అప్రజాస్వామికంగా దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారిని అడ్డుకోవడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని నిలదీశారు.  నెల్లూరులో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా వ్యవహరిస్తున్న కప్పిర శ్రీనివాసులు అనే టిడిపి నాయకుడ్ని మంత్రి అనిల్ వారం రోజులుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధించడం వైసిపి నాయకుల శాడిస్టు, సైకో మనస్థత్వానికి నిదర్శనమన్నారు. వైసిపి నేతల వేధింపులు తట్టుకోలేక అతను ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. శ్రీనివాసులుకు ఎటువంటి ప్రాణహాని జరిగినా మంత్రి అనిల్ కుమార్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. చట్టానికి విరుద్దంగా వ్యవహరించిన పోలీసులు న్యాయస్థానం ముందు తలొంచుకుని నిలబడాల్సి వస్తుందన్నారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: