ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టోపీ.....

 క్రీడల షెడ్యూల్ ను ప్రకటించిన ఎంపీడీవో విజయ నరసింహారెడ్డి

క్రీడా ప్రాంగణం గురించి అడిగి , పరిశీలిస్తున్న ,..,..ఎంపీడీవో విజయ్ నరసింహారెడ్డి,

(జానో జాగో వెబ్ న్యూస్ _గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల లో మండల స్థాయి గ్రామీణ క్రీడాకారుల ప్రతిభనుతెలుసుకొని, వారి నైపుణ్యాన్ని మెరుగు పరచాలన్న ఉద్దేశంతో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి  గత నెలలో నే ఏపీ సీఎం ట్రోఫీని ప్రారంభించారు. అయితే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ ,జడ్పిటిసి ,స్థానాలకు ఎన్నికలు జరగవలసి వుండడంతో ఎన్నికల కోడ్ వలన, రాష్ట్రంలో అధిక వర్షాల కారణాల వలన ఏపీ సీఎం కప్ మండల స్థాయి ఎంపిక పోటీలు నిలిచిపోయాయి. మండలాలలో వాతావరణం అనుకూలించడంతో ఎంపీడీవో విజయ నర్సింహా రెడ్డి గడివేముల మండలం లోని జడ్.పి.హెచ్.ఎస్ ప్రాంగణంలోని క్రీడా మైదానాన్ని పరిశీలించి క్రీడాప్రాంగణం పోటీలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉందని కావున గడివేముల మండల పరిధిలో మండల స్థాయి క్రీడాకారులను సీఎం కప్ కు ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం కప్ షెడ్యూల్ను ప్రకటించారు. సీఎం కప్ క్రీడా సంబరాల షెడ్యూల్ను  తెలుపుతున్న...... గడివేముల ఎంపీడీవో విజయ నరసింహారెడ్డి.

ఈనెల 26-11-21 వ తేదీ న ఉదయం 10 గంటలకు గడివేముల మండలం లోని జడ్పీహెచ్ఎస్  ప్రాంగణంలో మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా 27-11-21 వ తేదీన ( గేమ్స్ ) వాలీబాల్, ఫుట్ బాల్, కబడి , ఖో ఖో,హ్యాండ్ బాల్ ,హాకీ ,బ్యాడ్మింటన్ , బాల్ బ్యాడ్మింటn ,బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, athletics  క్రీడాంశాలు ఉంటాయని పేర్కొన్నారు ,ఈ ఏపీ సీఎం  కప్ గ్రామీణ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల మరియు క్రీడాకారిణి ల వయసు 15 సంవత్సరాలు పూర్తయి ఉండాలని, క్రీడాకారులు మరియు క్రీడాకారులు వారి యొక్క సొంత ఖర్చులతో, సొంత క్రీడా పరికరాలతో, పాటు ఆధార్ కార్డును తీసుకొని వచ్చి గడివేముల మండలం లో జరిగే ఏపీ సీఎం కప్ గ్రామ స్థాయి ఎంపిక పోటీల్లో గడివేముల లోని 16 గ్రామాల్లో ఉండేటువంటి క్రీడల్లో ఆసక్తి గల క్రీడాకారులు, క్రీడాకారిణిలు పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. మండల స్థాయిలో తమ ప్రతిభను నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎంపికైన క్రీడాకారులు, పాణ్యం నియోజకవర్గంలో జరిగే పోటీల్లో పాల్గొనవలసి ఉంటుంది అని ,అక్కడ విజేతలైన వారు కర్నూలు జిల్లా లో జరిగే పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఆసక్తి గల  క్రీడాకారిణిలు, క్రీడాకారులు గడివేముల జడ్పీహెచ్ఎస్  పిడి.ఎస్ ,రవికుమార్ సెల్ నెంబర్ 9441759388, సంప్రదించి వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ఎంపీడీవో విజయ నర్సింహా రెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో గడివేముల జడ్పీహెచ్ఎస్ ఇంచార్జి హెచ్ ఎం ,దస్తగిరమ్మ, ఉపాధ్యాయులు సుధాకర్, కళ్యాణ్, సుధాకర్ రెడ్డి, బివిఆర్ జూనియర్ కాలేజ్ వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: