వినాశకాలే విపరీత బుద్ధి.. 

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన  కుటుంబ సభ్యులపై వైసిపి ఎమ్మెల్యేలు  చేసిన అనుచిత వ్యాఖ్యలపై మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఖండించారు. ఆంధ్రుల ఆరాధ్యదైవం అన్నఎన్టీఆర్ కుమార్తె రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు   కుటుంబ సభ్యులను,  వారి సతీమణిను   అసెంబ్లీ లో వైసీపీ ఎమ్మెల్యేలు అవమానిస్తూ, అవహేళన చేస్తూ  మాట్లాడం దారుణం అని  ఇదీ  యావత్తు మహిళా జాతికి జరిగిన అవమానం అని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రివర్యులు వైయస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును అసెంబ్లీలో నారా చంద్రబాబునాయుడు ప్రశ్నిస్తారు  అని భావించిన వైసిపి వారు మహిళలు  ఎంతో  పవిత్రంగా భావించె "కార్తీక పౌర్ణమి  పండుగ అని"  అటువంటి మహిళలకు  ఇష్టమైన,  పవిత్రమైన  రోజున  రోజున దేవాలయం లాంటి అసెంబ్లీ లో వైసీపీ వారు   ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన అన్న ఎన్టీఆర్ కుమార్తె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణిని అవమామిస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడటం చాలా  బాధాకరం,  అని  మహిళ లు  అంటే ఆ పార్టీ కు ఎంత గౌరవం ఉందొ అర్ధం అవుతోందని  అన్నారు. ఇప్పటికే కొంతమంది  గౌరవ రాష్ట్రమంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు  ఎటువంటి బాష వాడుతోన్నారో ,రాష్ట్ర ప్రజా నీకం మొత్తం చూస్తోందని వీరా ! మన ప్రజా ప్రతినిధులు అని ప్రజలు  విస్తుపోతున్నా రని, ఈరోజు జరిగిన సంఘటన  అసెంబ్లీ చరిత్ర లో  మాయని మచ్చగా నిలుస్తోందని,  ఇప్పటికే  ఎన్నో సార్లు  వైసీపీ  ప్రభుత్వం చంద్రబాబుని,  టీడీపీ  క్యాడర్ ను ఎన్నో అవమానా లు కు గురి చేస్తోందని ముఖ్యం గా వ్యక్తిగతం గా విమర్శలు చేస్తున్నారని  ఈరోజు అతి నీచం గా   అన్న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి గురించి అవమానకరంగా మాట్లాడటం  చాలా దారుణం అని  మహిళలు అంటే ఈ వైసీపీ  లో కొంతమంది ప్రజా ప్రతినిధులకు  ప్రభుత్వ పెద్దలకు అసలు గౌరవం,  మర్యాద లేవని ఈరోజు సంఘటన తో అది రుజువు అయిందని 

ఈరోజు జరిగిన ఘోర ఘటన తో  చంద్రబాబు ఎపుడూ లేని విధంగా  కంట తడిపెట్టి  ఇంత దౌర్భాగ్యసంఘటన లు  జరిగే ఈ కౌరవ సభ లో ఈ ప్రభుత్వం కొనసాగినంతకాలం మళ్ళీ తాను అడుగుపెట్టనని శపధం చేసారని  ఈ దుర్మార్గపు వైసిపి కౌరవులు   ప్రజా సమస్యలపై ద్రుష్టి పెట్టకుండా,  ప్రతి పక్షం యెక్క పర్సనల్  మరియు వారి కుటుంబ  సభ్యులను టార్గెట్ చేస్తూ  మాట్లాడడాన్ని నిరసిస్తూ ఇక ఈ అసెంబ్లీ లో అడుగు పెట్టనని గతం లో కూడా  ఇలాగే  అన్న  ఎన్టీఆర్  అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం   అవమానిస్తే  మళ్ళీ  ముఖ్యమంత్రి గానే అడుపెడతామని  శపధం చేసి  మళ్ళీ ఆయన 1994 లో  ప్రజా దీవెనలు తో   ముఖ్యమంత్రి గా  అసెంబ్లీ లో  అడుగుపెట్టారని మళ్ళీ  అదే చరిత్ర పునరావృతం అవుతుంది అని  2024 లో  కూడా  ఈ  రాక్షస ప్రభుత్వం కు  ప్రజలు  ఓటు ద్వారా  బుద్ది చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గా  అసెంబ్లీ కి  ఘనంగా తీసుకువెళ్తారని  మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: