కరోనా కేసులు తగ్గాయి...

మరణాలు కాస్త పెరిగాయి


కరోనా థర్డ్ వెవ్ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నా తరుణంలో కాస్తl ఊరటనిచ్చే పరిణామాలు దేశంలో చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ కరోనా భారీగా పడిన వారిలో మరణాలు కాస్త ఎక్కువగా సంభవిస్తున్న అంశం కలవరపాటుకు గురి చేస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్న కొత్తగా 10 వేలకుపైగా కేసులు వెలుగు చూడగా.. 12 వేలకుపైగా రికవరీలు చోటుచేసుకున్నాయి. అయితే అంతకుముందు రోజుతో పోల్చితే మరణాల సంఖ్య మాత్రం కాస్త పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.


నిన్న 10,74,099 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,488  కొత్త కేసులు వెలుగుచూశాయి.గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో చికిత్స పొందుతూ 313 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,65,662కి చేరింది. గత కొన్ని రోజులుగా రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. తాజాగా 12,329 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.39 కోట్లు దాటింది. దీంతో రికవరీ రేటు 98.30 శాతానికి పెరిగింది. గత ఏడాది మార్చి తర్వాత ఇదే అత్యధికం._

రికవరీలు మెరుగ్గా ఉండటంతో క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,22,714కి చేరింది. ఆ రేటు 0.36%కి తగ్గి.. 532 రోజుల కనిష్ఠానికి చేరింది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 67,25,970 మందికి టీకాలు వేయగా.. ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 116 కోట్లు దాటింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


      

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: