మార్కాపురం ప్రధాన రహదారి వద్ద...
లారీ బోల్తా తప్పిన ప్రమాదం
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రం నుండి మార్కాపురం ప్రధాన రహదారిలో నాయుడు పల్లి కాలనీ సమీపంలో లారీ బోల్తా పడింది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామానికి చెందిన కందుల జేమ్స్ ముఠా తెలంగాణ రాష్ట్రం ఒడిమెల్ల మండలం ముద్దాడి పాడు గ్రామానికి పత్తి పనుల కొరకు లారీలో 30 మంది కూలీలు బయలుదేరగా మార్గమధ్యలో తర్లుపాడు గ్రామ సమీపంలో బోల్తా పడింది.
ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా వారు కందుల అంబ్రొస్, కందుల నాగమ్మ, కందుల రేసు కుమారి కి స్వల్పగాయాలయ్యాయి. తర్లుపాడు నుండి మార్కాపురం వెళ్తున్న కాట మాల రాహుల్ సంఘటన స్థలంలో గాయాలతో ఉన్న వారికి ధైర్యం చెప్పి హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏ ఎస్ ఐ సంజయ్, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు మార్కాపురం టు తర్లుపాడు మార్గం సింగిల్ రోడ్డు కావడంతో పెరిగిన ట్రాఫిక్ నిత్యం ట్రాఫిక్ తో ప్రజలు మార్కాపురం వెళ్లాలంటే ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు ప్రయాణం నరకప్రాయంగా ఉందని అధికారులు, నాయకులు చొరవ తీసుకొని వెంటనే డబల్ రోడ్డు వేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.
Post A Comment:
0 comments: