అసెంబ్లీలో  ‘జై భీమ్’

సమాజంలో అక్కడక్కడ అసమానతలు కనిపిస్తున్నాయి

సమాజ మార్పు కోసం తెలుగులో ఇలాంటి సినిమాలు రావాలి

అసెంబ్లీలో  ‘జై భీమ్’ చిత్రం గురించి ప్రస్తావించిన గండికోట శ్రీకాంత్ రెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్ _ఏపీ పొలిటికల్ బ్యూరో)

అసమానతల రూపుమాపడం కోసం  ‘జై భీమ్’ ఇలాంటి చిత్రాలు తెలుగులో కూడా రావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమంపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా ‘జై భీమ్’ చిత్రం ప్ర‌స్తావ‌న‌ వచ్చింది. ఈ సందర్భంగా ప్ర‌భుత్వ ఛీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఇంకా అక్క‌డ‌క్క‌డా అంట‌రానిత‌నం క‌నిపిస్తోందన్నారు. తమ కుటుంబం అంతా జైభీమ్ సినిమాను చూశామన్నారు. అసమాన‌త‌లు, వివ‌క్ష ఉన్న చోట అధికారులు, రాజ‌కీయ నాయ‌కులు అవ‌గాహ‌న క‌లిగించాలని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. స‌మాజం గురించి ఎప్ప‌డూ మాట్లాడ‌కుండా సినిమాలు తీసి కోట్లు గ‌డిస్తున్న‌వారు ఈ సినిమాను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. త‌మిళ సినిమా వాళ్ళు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ని ప‌క్క‌న పెట్టి ఇలాంటి సినిమాలు తీయాలని కోరుతున్నానన్నారు. ఇలాంటి సినిమాలు తెలుగులో కూడా రావాల‌ని కోరుతున్నానన్నారు. ఇక్క‌డ‌ క‌మ‌ర్షియ‌ల్ దృష్టిలో సినిమాలు తీస్తున్నారన్నారు. మెసెజ్ ఓరియంటెడ్‌గా సినిమాలు తీయాల‌ని వారిని కోరుతున్నానని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: